ఫ్రెండ్స్‌తో పాటు చిరునవ్వులు చిందిస్తూ ఫోటోకు పోజిచ్చిన ఈ చిన్నది ఎవరో గుర్తుపట్టారా.! ఇప్పుడొక క్రేజీ హీరోయిన్. అబ్బాయిలకు ఏంజిల్. తెలుగులో నటించిన తొలి సినిమాతోనే కుర్రకారు హృదయాలను దోచేసుకుంది. అటు గ్లామర్ పాత్రలతో పాటు.. ఇటు నటనకు కూడా ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ తన కెరీర్‌లో ముందుకు సాగుతోంది.
ఈ భామ ఖాతాలో హిట్స్ తక్కువే ఉన్నప్పటికీ.. యువ హీరోల సరసన నటించి మెప్పించింది. ఈ చిన్నారి ఎవరో ఇప్పుడైనా గుర్తుపట్టారా.! లేదా క్లూ ఇమ్మంటారా.. నితిన్ నటించిన ‘లై’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ భామ. ఆ వెంటనే ఈ హీరోతోనే ‘ఛల్ మోహన రంగా’ మూవీలో నటించింది. ఈపాటికి మీకు అర్ధమై ఉంటుంది. ఆమెవరో కాదు మేఘా ఆకాష్.
తెలుగు, తమిళ భాషల్లో పలు చిత్రాల్లో నటించి మెప్పించిన మేఘా ఆకాష్.. టాలీవుడ్‌లో ‘రాజ రాజ చొర’తో తొలి హిట్ అందుకుంది. ప్రస్తుతం ‘మను చరిత్ర’, ‘యాదుం ఊరే యావరుం కేలిర్’, ‘గుర్తుందా శీతాకాలం’, ‘అక్టోబర్ 31 లేడీస్ నైట్’ చిత్రాల్లో నటిస్తోంది.