మా చేతులలో పెరిగిన చిన్నారిని నీచెతుల్లో పెడుతున్న.. మెగాస్టార్ ఎమెషనల్ ట్వీట్
నాగబాబు కుమర్తె నిహారిక-చైతన్యల పెళ్ళి వేడుకులు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. అటు ఇరు కుటుంబాలు ఇప్పటికే ఉదయ్ పూర్‌కు చేరుకున్నాయి.

నాగబాబు కుమర్తె నిహారిక-చైతన్యల పెళ్ళి వేడుకులు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. అటు ఇరు కుటుంబాలు ఇప్పటికే ఉదయ్ పూర్‌కు చేరుకున్నాయి. సోమవారం రాత్రి జరిగిన సంగీత్‌లో నిహారిక చైతన్యలు చిరంజీవి నటించిన సినిమాల్లోని పాటలకు డాన్స్ చేశారు. నిహారిక పెళ్ళి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు.
ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి నిహారిక చిన్నప్పటి పోటోతోపాటు, ఇటీవల పెళ్ళి కుమర్తెను చేసిన తర్వాత దిగిన సెల్ఫీని కలిపి ట్విట్టర్లో షేర్ చేశారు. ” మా చేతిలో పెరిగిన మా చిన్నారి నిహారికని, చైతన్య చేతిలో పెడుతున్న ఈ శుభతరుణంలో కాబోయే దంపతులకు ముందస్తుగా నా శుభాకాంక్షలు. ఆశీస్సులు” అని షేర్ చేసాడు చిరు. కాగా డిసెంబర్ 9న గుంటూరు ఐజీ జె. ప్రభాకర్ రావు కుమారుడు చైతన్యతో నిహారిక వివాహన్ని రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో నిర్వహించనున్నారు.
మా చేతిలో పెరిగిన మా చిన్నారి నిహారికని, చైతన్య చేతిలో పెడుతున్న ఈ శుభతరుణంలో, ముందస్తుగా, కాబోయే దంపతులకు నా శుభాకాంక్షలు , ఆశీస్సులు. God bless you! #NisChayWedding @IamNiharikaK pic.twitter.com/eLLPcZcYZV
— Chiranjeevi Konidela (@KChiruTweets) December 8, 2020