Chiranjeevi- KCR: మాజీ సీఎం కేసీఆర్‌ గాయంపై స్పందించిన మెగాస్టార్‌ చిరంజీవి.. ఏమన్నారంటే?

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో సహా పలువురు రాజకీయ ప్రముఖులు కేసీఆర్‌ ఆరోగ్యంపై ఆరా తీశారు. కేసీఆర్‌ త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్‌ చేశారు సీఎం రేవంత్‌ రెడ్డి. కేసీఆర్‌ ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నట్టు చెప్పారు. మెగాస్టార్‌ చిరంజీవి కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితిపై స్పందించారు. ఆయన త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్ చేశారు

Chiranjeevi- KCR: మాజీ సీఎం కేసీఆర్‌ గాయంపై స్పందించిన మెగాస్టార్‌ చిరంజీవి.. ఏమన్నారంటే?
Chiranjeevi, KC

Updated on: Dec 08, 2023 | 9:46 PM

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ శుక్రవారం (డిసెంబర్‌8) ఉదయం సోమాజి గూడ యశోదా ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. జారి పడడంతో కేసీఆర్‌కు తుంటిఎముక విరిగినట్టు వైద్యులు నిర్ధారించారు. ఆయనకు శస్త్ర చికిత్స చేయాలని డాక్టర్లు నిర్ణయించారు. కేసీఆర్ ఆస్పత్రిలో చేరారని తెలియగానే ఆయన అభిమానులు, బీఆర్ఎస్‌ పార్టీ నేతలు, కార్యకర్తలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. తమ నాయకుడు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఇక ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో సహా పలువురు రాజకీయ ప్రముఖులు కేసీఆర్‌ ఆరోగ్యంపై ఆరా తీశారు. కేసీఆర్‌ త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్‌ చేశారు సీఎం రేవంత్‌ రెడ్డి. కేసీఆర్‌ ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నట్టు చెప్పారు. మెగాస్టార్‌ చిరంజీవి కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితిపై స్పందించారు. ఆయన త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్ చేశారు. కేసీఆర్‌ సార్‌కు గాయమైందని తెలిసి చాలా బాధ పడ్డాను. ఆయనకు శస్త్ర చికిత్స విజయవంతం కావాలి. త్వరగా కోలుకోవాలి’ అని చిరంజీవి ఆకాంక్షించారు.

ఇక సినిమాల విషయానికి వస్తే..ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో ఓ సోషియో ఫాంటసీ మూవీని చేస్తున్నారు మెగాస్టార్‌ చిరంజీవి. ఇటీవలే పూజా కార్యక్రమాలతో ఈ మూవీ ఘనంగా ప్రారంభమైంది. త్రిష, అనుష్క హీరోయిన్లుగా నటించవచ్చునని వార్తలు వస్తున్నాయి. అలాగే విశ్వంభర అనే టైటిల్‌ను ఖరారు చేసే యోచనలో ఉన్నారని తెలుస్తోంది. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన విషయాలను అధికారికంగా ప్రకటించనున్నారు.

ఇవి కూడా చదవండి

మెగాస్టార్ చిరంజీవి ట్వీట్..

ఆస్పత్రిలో కేసీఆర్..

హరీశ్ రావు ఏమన్నారంటే?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.