సక్సెస్ ఫుల్ టాలెంటెడ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వం వహిస్తున్న లేటేస్ట్ చిత్రం వాల్తేరు వీరయ్య. చాలా కాలం తర్వాతా ఈ సినిమాతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ మాస్ లుక్ లో చూపించబోతున్నారు. ఇందులో చిరు జోడిగా అందాల శ్రుతి హాసన్ నటిస్తుండగా.. కీలకపాత్రలో మాస్ మాహారాజా రవితేజ కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. మరోవైపు ఇటీవల విడుదలైన టీజర్ సినిమాపై హైప్ క్రియేట్ చేసింది. ఇక కొద్దిరోజులుగా ఈ మూవీలోని సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇక తాజాగా విడుదలైన పూనకాలు లోడింగ్ పాటకు యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ వస్తున్నాయి. ఇందులో రవితేజ, చిరు కలిసి వేసిన స్టెప్పులు మాస్ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. అయితే అభిమానులను ఆకట్టుకుంటున్న ఈ పాటతోనే కొత్త సంవత్సరం శభాకాంక్షలు తెలిపారు మెగాస్టార్.
“బైబై 2022.. డ్యాన్స్ చేయడం ఆపకండి. 2023 ఏడాదికి శుభాకాంక్షలు. పూనకాలు లోడింగ్.. కొత్త సంవత్సరం శుభాకాంక్షలు” అంటూ రాసుకోచ్చారు. ప్రస్తుతం చిరు చేసిన ట్వీట్ నెట్టింట వైరలవుతుంది. ఇక చిరుతోపాటు..వాల్తేరు వీరయ్య చిత్రబృందానికి కూడా న్యూఇయర్ విషెస్ తెలుపుతున్నారు నెటిజన్స్.
వాల్తేరు వీరయ్య చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌటేలా సైతం చిరుతో స్టెప్పులేసింది. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది. ఇప్పటికే చిత్రయూనిట్ ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేసింది.
Good Bye 2022 !!
Don’t Stop Dancing ? ?
Welcome 2023 !!
Poonakalu Loading !!! ??
Happy New Year to All !! ??
— Chiranjeevi Konidela (@KChiruTweets) December 31, 2022
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.