ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా సూపర్ హిట్ సినిమాలతో పాటు ఆకట్టుకునే వెబ్ సిరీస్ లు.. ఆసక్తికర గేమ్ షోలతో పాటు టాక్ షోలను కూడా నిర్వహిస్తుంది. ఇక ఆహా అందించిన అన్ స్టాపబుల్ షో కు ఏ రేంజ్ లో క్రేజ్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవరసం లేదు. నటసింహం నందమూరి బాలకృష్ణ హౌస్ గా వ్యవహరించిన అన్ స్టాపబుల్ షో సూపర్ సక్సెస్ అయ్యింది. ఇప్పటికే విజయవంతంగా రెండు సీజన్స్ ను పూర్తి చేసుకుంది ఈ టాక్ షో. ఎంతో మంది సూపర్ హీరోలతో పాటు పలువురు రాజకీయ నాయకులు కూడా ఈ టాక్ షోకు హాజరయ్యారు. ఇక నందమూరి బాలకృష్ణ తనదైన హోస్టింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. గెస్ట్ లుగా వచ్చిన వారిని తనదైన స్టైల్ లో ప్రశ్నలు అడిగి తికమక పెడుతూ ఓ ఆట ఆడుకున్నారు బాలయ్య.
ఇక ఇప్పుడు అన్ స్టాపబుల్ సీజన్ 3 మొదలు కానుంది. మరింత జోష్ తో అన్ స్టాపబుల్ సీజన్ 3 మొదలు పెట్టనున్నారు బాలకృష్ణ. ఇప్పటికే సీజన్ 3 కోసం ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయని తెలుస్తోంది. ఈ సీజన్ లో మరికొంతమంది స్టార్ హీరోలు, హీరోయిన్స్ హాజరుకానున్నారని తెలుస్తోంది. బాలయ్య మరింత జోష్ గా ఈ సీజన్ ను నడిపించనున్నారు.
ఇక ఈ సీజన్ 3లో మరింతగా ఇంట్రెస్టింగ్ ఉండనుందని తెలుస్తోంది. అన్ స్టాపబుల్ 3 మొదటి ఎపిసోడ్ కు గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి హాజరు కానున్నారని తెలుస్తోంది. మెగాస్టార్ తో అన్ స్టాపబుల్ సీజన్ 3 ని గ్రాండ్ గా ప్రారంభించనున్నారని తెలుస్తోంది. బాలయ్య, చిరంజీవి కలిసి కనిపిస్తే అభిమానులకు పండగే. మరి బాలయ్య మెగాస్టార్ మధ్య ఎలాంటి సరదా సంభాషణ జరుగుతుందో చూడాలి. బాలయ్య ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు..? మెగాస్టార్ ఎలాంటి సమాదానాలు చెప్తారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
A heartfelt thank you to Mr. BIG B @SrBachchan ji. ❤️
Thank you so much for blessing our Pasivadu 🫶🏻
Watch #PapamPasivadu Premieres Sept 29
1 Day to go! 🥳@Sreeram_singer @DWeekendShow @ahavideoIN @AkhileshTF #LalithKumar @RashiReal_ @PSrividya53 #GayatriChaganti #GokulBharathi… pic.twitter.com/poB963Khs7— ahavideoin (@ahavideoIN) September 28, 2023
Em jaragabothundhi?🤔
Teliyalante stay tune on aha#TheGreatIndianSuicideOnAHA👉 #basedontrueincidents pic.twitter.com/pAYiOklz9L— ahavideoin (@ahavideoIN) October 5, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.