Godfather Twitter Review: బాసూ కొట్టావ్‌గా బ్లాక్ బస్టర్.. గాడ్ ఫాదర్ ట్విట్టర్ రివ్యూ

|

Oct 05, 2022 | 7:15 AM

రీ ఎంట్రీ తర్వాత వరుస సినిమాలతో జోరుమీదున్న చిరు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైనప్ చేసి ఆయా షూటింగ్స్ తో ఫుల్ బిజీగా ఉన్నారు.

Godfather Twitter Review: బాసూ కొట్టావ్‌గా బ్లాక్ బస్టర్.. గాడ్ ఫాదర్ ట్విట్టర్ రివ్యూ
God Father
Follow us on

ఆచార్య సినిమాతో నిరాశలో ఉన్న ఫ్యాన్స్ కు గాడ్ ఫాదర్ సినిమాతో సాలిడ్ కిక్ ఇవ్వడానికి వస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. రీ ఎంట్రీ తర్వాత వరుస సినిమాలతో జోరుమీదున్న చిరు.. బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైనప్ చేసి ఆయా షూటింగ్స్ తో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇక ఆ సినిమాల్లో ‘గాడ్ ఫాదర్’ సినిమాను ఈ రోజు (అక్టోబర్ 5న ) ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఈ సినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగా దర్శకుడు మోహన్ రాజా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో బాస్ డిఫరెంట్ గెటప్ లో కనిపించి ఆకట్టుకున్నారు. టైటిల్ దగ్గర నుంచి మొన్నీమధ్య విడుదలైన ట్రైలర్, సాంగ్స్ వరకు అన్నీ ఈ సినిమా భారీ బజ్ ను క్రియేట్ చేశాయి. ఇక ఆ భారీ అంచనాల మధ్య నేడు విడుడుదలవుతోన్న గాడ్ ఫాదర్ ప్రీమియర్స్ ఇప్పటికే ప్రదర్శించబడ్డాయి.

ఇక ఈ సినిమాలో మెగాస్టార్‌తోపాటు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్న విషయం తెలిసిందే. అంతే కాదు ఈ ఇద్దరు మార్ మార్ థక్కర్ మార్ అంటూ స్టెప్పులు కూడా వేశారు ఈ సినిమాలో.. అలాగే మెగాస్టార్ సిస్టర్ గా నయనతార నటిస్తుండగా ఇతర ముఖ్య పాత్రల్లో సత్యదేవ్, సునీల్, సముద్ర ఖని, పూరీ జగన్నాథ్ నటించారు. ఇక ఇప్పటికే ఈ సినిమా చూసిన  ప్రేక్షకులు తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలుపుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ సినిమా తో మెగాస్టార్ చిరంజీవి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారని అంటున్నారు నెటిజన్లు, బాస్ విత్ బ్లాక్ బస్టర్ అంటూ కొందరు ట్వీట్ చేస్తుంటే మరికొంతమంది ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ కంటే పెద్ద హిట్ మెగాస్టార్ కొట్టబోతున్నారు అంటూ కామెంట్స్  చేస్తున్నారు.