Megastar Chiranjeevi: వాళ్లకు నేనే పోటీ.. ఈ క్షణం కోసం దశాబ్దాల నుంచి ఎదురుచూస్తున్నా.. చిరంజీవి ఆసక్తికర కామెంట్స్..
గతంలో నిర్వహించిన చలన చిత్రోత్సవంలో ఒక్క దక్షి ణాది నటుడి ఫోటో లేకపోవడంపై చాలా బాధపడ్డానని.. ఇప్పుడు అవార్డ్ అందుకోవడం ఆనందంగా ఉందని అన్నారు చిరంజీవి
తనకు యువ హీరోలు పోటీ కాదని.. వాళ్లకు తనే పోటీ అన్నారు మెగాస్టార్ చిరంజీవి. గోవా వేదికగా జరిగిన 53వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవ ముగింపు వేడుకల్లో పాల్గొన్న చిరు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇదే వేడుకల్లో ఆయన ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ అందుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గతంలో నిర్వహించిన చలన చిత్రోత్సవంలో ఒక్క దక్షి ణాది నటుడి ఫోటో లేకపోవడంపై చాలా బాధపడ్డానని.. ఇప్పుడు అవార్డ్ అందుకోవడం ఆనందంగా ఉందని అన్నారు.
ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. ” ఈ అవార్డ్ ఇచ్చిందుకు ఇఫీ, భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు. ప్రత్యేకంగా నిలిచే ఈ అవార్డుల్లో ఇదొకటి. ఈ క్షణం కోసం దశాబ్దాల నుంచి ఎదురుచూస్తు్న్నాను. సరైన సమయంలోనే నాకు ఇచ్చారని భావిస్తున్నాను. ఈ అవార్డు నాకే కాదు నా అభిమానుల్లోనూ ఎనలేని ఉత్సాహాన్ని నింపింది. గతంలో జరిగిన చలన చిత్రోత్సవ వేడుకలకు ఒకసారి వచ్చాను. అప్పుడు ఈ చలన చిత్రోత్సవంలో ఒక్క దక్షి ణాది నటుడి ఫోటో లేకపోవడంపై చాలా బాధపడ్డానని.. ఇప్పుడు అవార్డ్ అందుకోవడం ఆనందంగా ఉంది. నేను ఓ మధ్య తరగతి కుటుంబంలో జన్మించాను. శివ శంకర్ వరప్రసాద్ అనే నా కు.. సినీ పరిశ్రమ చిరంజీవిగా మరో జన్మనిచ్చింది. 45 ఏళ్లకు పైగా ఇండస్ట్రీలో ఉన్నాను.. రాజకీయంలోకి వెళ్లడం వల్ల కొన్నాళ్లు గ్యాప్ వచ్చింది.
రాజకీయంలోకి వెళ్లడం వల్ల సినిమా విలువేంటో అర్థమైంది. ఇక్కడ ప్రతిభకు ఒక్కటే కొలమానం. రీ ఎంట్రీ సమయంలో ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారోనని సందేహం ఉండేది. ఎప్పటిలానే నాపై ప్రేమ చూపారు. వారి ప్రేమకు నేను దాసుణ్ని. జీవితాంతం చిత్ర పరిశ్రమలోనే ఉంటాను. నాకు యువ హీరోలు పోటీ కాదు. నేనే వాళ్లకు పోటీ.. వాళ్లకు ఇప్పుడు చాలా కష్టకాలమే. సినిమా ఎక్కడైనా తీయొచ్చు, కానీ అది భారతీయ సినిమా అని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ప్రాంతీయ బేధాలు పోయి భారతీయ సినిమా అనే రోజు వచ్చింది.” అంటూ చెప్పుకొచ్చారు మెగాస్టార్.