ఇటీవలే ఆచార్య సినిమాతో ప్రేక్షకులను అలరించారు మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi).. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించినంత స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దీంతో తన తదుపరి ప్రాజెక్ట్స్ పై ఫోకస్ పెట్టారు చిరు.. ప్రస్తుతం ఆయన చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. గాడ్ ఫాదర్, భోళా శంకర్, మెగా 154 ప్రాజెక్టు చిత్రీకరణలో పాల్గొంటూ క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్నారు…. ఇప్పటికే చేతిలో నాలుగు ప్రాజెక్ట్స్ ఉన్న చిరు.. తాజాగా మరో సినిమాను ప్రకటించారు..
డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్లు చెప్పుకొచ్చారు.. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మారుతి.. మ్యాచో హీరో గోపిచంద్ కాంబోలో రాబోతున్న చిత్రం పక్కా కమర్షియల్.. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీలో రాశీఖన్నా కథానాయికగా నటిస్తోంది.. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ జూలై 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఆదివారం హైదరాబాద్ లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా పాల్గోన్న చిరు తన తదుపరి ప్రాజెక్ట్ గురించి అనౌన్స్ చేశారు..
చిరు మాట్లాడుతూ.. యూవీ క్రియేషన్స్ నిర్వాహకులు విక్కి, ప్రమోద్ చరణ్ కు గుడ్ ఫ్రెండ్స్.. వీళ్లు మా ఇంట్లో వాళ్లలాగా.. ఒకసారి విక్కీ నాతో మాట్లాడుతూ..మీతో మారుతితో ఓ సినిమా చేయాలనుంది అని చెప్పారు.. దానికి నేను ఓకే అన్నాను.. మేము కచ్చితంగా సినిమా చేస్తున్నాం..మారుతి నీకున్న కమిట్స్మెంట్స్ పూర్తి చేయి.. ఆ తర్వాత మనం సినిమా చేద్దాం.. పక్కా కమర్షియల్ గా బేరం కుదిరిపోయిందంటూ చెప్పుకొచ్చారు చిరు..
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.