AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Megastar Chiranjeevi: రామ్ చరణ్ కంటికి సర్జరీ.. స్పందించిన మెగాస్టార్ చిరంజీవి..

పెద్ది సినిమా చిత్రీకరణ సమయంలో జరిగిన ప్రమాదంలో రామ్ చరణ్ స్వల్పంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఇదివరకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పందిస్తూ చరణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. చరణ్ ఎడమ కంటికి స్వల్ప గాయమైందని.. చిన్న చికిత్స అనంతరం ఆయన కోలుకున్నారంటూ చిత్రయూనిట్ తెలిపింది. తాజాగా చరణ్ గాయం విషయంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు.

Megastar Chiranjeevi: రామ్ చరణ్ కంటికి సర్జరీ.. స్పందించిన మెగాస్టార్ చిరంజీవి..
Chiranjeevi, Ram Charan
Rajitha Chanti
|

Updated on: Mar 26, 2026 | 3:16 PM

Share

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ పెద్ది. ఈ సినిమా షూటింగ్ కొన్ని నెలలుగా వేగంగా జరుగుతుంది. ఈ క్రమంలోనే చిత్రీకరణ సమయంలో జరిగిన చిన్న ప్రమాదంలో చరణ్ స్వల్పంగా గాయపడిన సంగతి తెలిసిందే. కొన్ని యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా.. ఆయన ఎడమ కంటికి చిన్న దెబ్బ తగిలింది. దీంతో షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇప్పటికే చరణ్ గాయం పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. చరణ్ త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేశారు. దీంతో చరణ్ కు ఎంత పెద్ద తగిలిందో అంటూ అభిమాులు కంగారు పడ్డారు. అటు సోషల్ మీడియాలో చరణ్ హెల్త్ అప్డేట్ కోసం ఫ్యాన్స్ తెగ ఎదురుచూశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా చరణ్ గాయంపై హెల్త్ అప్డేట్ ఇచ్చింది చిత్రయూనిట్.

ఎక్కువ మంది చదివినవి : Sri Sri: ఆ హీరో నా ప్రతి అక్షరానికి విలువ కట్టి పారితోషికం ఇచ్చారు.. శ్రీశ్రీ కామెంట్స్ వైరల్..

రామ్ చరణ్ ఎడమ కంటికి స్వల్ప గాయమైందని.. తగిన చికిత్స తీసుకున్నాక ఆయన కోలుకున్నారని.. క్షేమంగా ఉన్నారని పెద్ది చిత్రయూనిట్ తెలిపింది. ముందుగా ప్లాన్ చేసిన విధంగానే గురువారం (మార్చి 26) నుంచి చరణ్ మళ్లీ షూటింగ్ లో పాల్గొంటారని వెల్లడించింది. చరణ్ ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. రామ్ చరణ్ గాయం గురించి వస్తున్న రూమర్లను నమ్మొద్దని మెగా అభిమానులకు విజ్ఞప్తి చేశారు పెద్ది మూవీ మేకర్స్. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ ప్రకటన విడుదల చేశారు.

ఎక్కువ మంది చదివినవి : Monalisa : నన్ను ఎక్కడెక్కడో తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడు.. శారీరకంగా వేధించాడు.. మోనాలిసా సంచలన కామెంట్స్..

ఇదిలా ఉంటే.. రామ్ చరణ్ హెల్త్ గురించి మెగాస్టార్ చిరంజీవి సైతం సోషల్ మీడియా ద్వారా స్పందించారు. చరణ్ కు సర్జరీ చేసిన డాక్టర్ సుధాకర్ ప్రసాద్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. “చరణ్ కనురెప్పకు మీరు సకాలంలో, నైపుణ్యంతో చేసిన శస్త్రచికిత్స నిజంగా మాకు ఒక వరంలాంటిది. మాకు ఆందోళన కలిగించిన ఆ క్షణం, మీ కచ్చితత్వం, శ్రద్ధ, నైపుణ్యంతో మీరు చెప్పిన ఆ మాటలతో మా భయం పూర్తిగా తొలగిపోయింది. మీ పనితనమే అన్నింటికీ కారణం, అందుకు మేము నిజంగా కృతజ్ఞతలు” అంటూ ట్వీట్ చేశారు. చిరు ట్వీట్ పై మెగా ఫ్యాన్స్ రియాక్ట్ అవుతూ చరణ్ త్వరగా కోలుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Ram Gopal Varma: ఆ మహా మనిషికి తలవంచి పాదాభివందనం చేస్తా.. ఆయన గొప్ప వ్యక్తి.. రామ్ గోపాల్ వర్మ..

ఎక్కువ మంది చదివినవి : Tollywood: కోటి 40 లక్షలు పెట్టి సినిమా తీశా.. అప్పు తీర్చడానికి 6 ఏళ్లు కప్పులు కడిగాను.. టాలీవుడ్ నటుడు..

Follow Us