Megastar Chiranjeevi- Trisha: త్రిషకు మెగాస్టార్ చిరంజీవి మద్దతు.. మన్సూర్ అలీఖాన్ వ్యాఖ్యలపై ఆగ్రహం..

|

Nov 21, 2023 | 11:21 AM

లియో సినిమాలో తనను సెలెక్ట్ చేసినందుకు ఎంతో సంతోషించానని.. చాలా సినిమాల్లో ఉన్నట్లే ఇందులోనూ త్రిషతో రేప్ సీన్ ఉంటుందని భావించానని.. కానీ అలాంటి సన్నివేశం లేకపోవడంతో బాధపడ్డానంటూ సంచలన కామెంట్స్ చేశారు మన్సూర్. దీంతో అతడి తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే కోలీవుడ్, టాలీవుడ్ నటీనటులు, రాజకీయ ప్రముఖులు మన్సూర్ అలీ వ్యాఖ్యలపై మండిపడ్డారు. అతడిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Megastar Chiranjeevi- Trisha: త్రిషకు మెగాస్టార్ చిరంజీవి మద్దతు.. మన్సూర్ అలీఖాన్ వ్యాఖ్యలపై ఆగ్రహం..
Megastar Chiranjeevi, Trisha
Follow us on

హీరోయిన్ త్రిషపై లియో నటుడు మన్సూర్ అలీఖాన్ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. గత నాలుగు రోజులుగా సోషల్ మీడియాలో మన్సూర్ అలీఖాన్ కామెంట్స్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లియో సినిమాలో తనను సెలెక్ట్ చేసినందుకు ఎంతో సంతోషించానని.. చాలా సినిమాల్లో ఉన్నట్లే ఇందులోనూ త్రిషతో రేప్ సీన్ ఉంటుందని భావించానని.. కానీ అలాంటి సన్నివేశం లేకపోవడంతో బాధపడ్డానంటూ సంచలన కామెంట్స్ చేశారు మన్సూర్. దీంతో అతడి తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే కోలీవుడ్, టాలీవుడ్ నటీనటులు, రాజకీయ ప్రముఖులు మన్సూర్ అలీ వ్యాఖ్యలపై మండిపడ్డారు. అతడిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అయితే ఈ వివాదంపై మన్సూర్ స్పందించిన సంగతి తెలిసిందే. తాను త్రిషను ఆ మాటలు అనలేదని.. తన మాటలను ఎడిట్ చేసి వీడియో షేర్ చేసి కావాలని తనను బ్యాడ్ చేస్తున్నారంటూ ఓ నోట్ షేర్ చేశాడు.

త్రిషకు మద్దతుగా ఇప్పటికే లియో డైరెక్టర్ లోకేష్ కనగరాజ్, సింగర్ చిన్మయి, డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు, హీరోయిన్ మాళవిక చిన్మయి, నితిన్, మంత్రి రోజా ఇలా చాలామంది సినీ ప్రముఖులు స్పందించారు. తాజాగా మన్సూర్ కామెంట్లపై మెగాస్టా్ర్ చిరంజీవి స్పందించారు. ఇలాంటి కామెంట్స్ ఏ అమ్మాయికి వచ్చినా తాను అండగా ఉంటానని అన్నారు చిరు.

“త్రిష గురించి మన్సూర్ చేసిన కామెంట్స్ నా దృష్టికి వచ్చాయి. ఇలాంటి వ్యాఖ్యలు ఒక నటికి మాత్రమే కాదు.. ఏ స్త్రీని అనడానికి అయినా అసహ్యంగా ఉన్నాయి. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించాలి. వక్రబుద్ధితో ఇలాంటివి మాట్లాడుతున్నారు. త్రిషకు మాత్రమే కాదు.. ఇలాంటి వ్యాఖ్యలు ఏ అమ్మాయికి వచ్చినా నేను అండగా.. మద్దతుగా నిలబడతాను ” అంటూ ట్వీట్ చేశారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.