Pushpa : అల్లు అర్జున్ ఆర్మీ మొత్తం డిసెంబర్ 17 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. సుకుమార్ దర్శకత్వంలో బన్నీ నటిస్తున్న ఊర మాస్ సినిమా పుష్ప రిలీజ్ కు రెడీగా ఉంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ మునుపెన్నడూ కనిపించనంత మాస్ లుక్ లో కనిపించనున్నాడు. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది. గంధపు చెక్కల నేపథ్యంలో తెరకెక్కుతున్న పుష్ప లో అల్లు అర్జున్ లారీ డ్రైవర్‌గా కనిపించనున్నాడు. ఇక ఈ సినిమానుంచి విడుదలైన ఈ సినిమా పోస్టర్లు , టీజర్స్, సాంగ్స్ అన్నీ సినిమా పై అంచనాలను పెంచేశాయి. అలాగే రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ ఆ అంచనాలను తారాస్థాయికి చేర్చింది. పాన్ ఇండియా మూవీగా తెరక్కుతున్న ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇక ఈ సినిమా రిలీజ్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ స్పీడ్ పెంచింది చిత్రయూనిట్.. ఈక్రమంలోనే డిసెంబర్ 12న ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్ కు ఎవరు గెస్ట్స్ గా వస్తారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఇక ఈ ఈ ఈవెంట్ కు నట సింహం నందమూరి బాలకృష్ణ హాజరు కానున్నారని టాక్ వినిపించింది. దానికి కారణం ఇటీవల అఖండ ఈవెంట్ కు బన్నీ హాజరయ్యాడు. అయితే ఇప్పుడు మరి కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి. గ్రాండ్ గా జరగనున్న ఈ ప్రీరిలీజ్ కు మెగాస్టార్ చిరంజీవి అతిథి గా హాజరుకానున్నారట.. అలాగే చిరుతోపాటు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా హాజరు కానున్నదంటున్నారు. ఈ ఇద్దరితోపాటు బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ కూడా ఈ ఈవెంట్ కు రానున్నారట. అల్లు అరవింద్ ప్రస్తుతం షాహిద్ కపూర్ తో జెర్సీ చిత్రాన్ని భాగస్వాములతో కలిసి నిర్మిస్తున్నారు. దాంతో ఈ ఈవెంట్ కు షాహిద్ ను ఆహ్వానించారని తెలుస్తుంది.
మరిన్ని ఇక్కడ చదవండి :