Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి గొప్ప మనసు.. సీనియర్ టెక్నీషియన్‏కు భారీగా ఆర్థిక సాయం..

|

Feb 02, 2023 | 3:51 PM

ఇక సేవా కార్యక్రమాలకు మెగాస్టార్ పెట్టింది పేరు. ఎవరికైనా కష్టం ఉందని తెలిస్తే వెంటనే స్పందించి తనవంతూ సాయం చేస్తుంటారు. ఇక ఇప్పుడు మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు చిరు.

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి గొప్ప మనసు.. సీనియర్ టెక్నీషియన్‏కు భారీగా ఆర్థిక సాయం..
Megastar Chiranjeevi
Follow us on

మెగాస్టార్ చిరంజీవి ఇటీవలే వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ బాబీ తెరకెక్కించిన ఈ మూవీలో రవితేజ, శ్రుతి హాసన్ కీలకపాత్రలలో నటించారు. ఇక మెగాస్టార్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినీ కార్మికులకు.. సినీ నటీనటులకు సాయం చేయడంలో ముందుంటారు. ఇప్పటికే ఎంతో మందికి సాయం చేసి వారి మనసులలో చెరగని ముద్ర వేసుకున్నారు. ఇక సేవా కార్యక్రమాలకు మెగాస్టార్ పెట్టింది పేరు. ఎవరికైనా కష్టం ఉందని తెలిస్తే వెంటనే స్పందించి తనవంతూ సాయం చేస్తుంటారు. ఇక ఇప్పుడు మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు చిరు.

టాలీవుడ్ సీనియర్ టెక్నీషియన్ అయిన సినిమాటోగ్రాఫర్ దేవరాజ్‏కు రూ. 5 లక్షల ఆర్థిక సాయాన్ని అందించారు. ఈ తరానికి తెలియకపోయినా.. దేవరాజ్ సినిమాటోగ్రఫి 80, 90 దశకంలోని సినీ ప్రియులకు తెలుసు. అప్పట్లో అందరూ స్టా్ర్ హీరోస్ చిత్రాలకు దేవరాజ్ ఛాయాగ్రహణం అందించేవారు. కేవలం తెలుగులోనే కాకుండా.. హిందీ, కన్నడ, మలయాళం, బెంగాలీ భాషల్లో దాదాపు 300కు పైగా సినిమాలకు తాను సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు.

ఇవి కూడా చదవండి

కానీ ప్రస్తుతం వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన పరిస్థితి ఆర్థికంగానూ కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న మెగాస్టార్ వెంటనే వారిని తన ఇంటికి ఆహ్వానించి ఆతిధ్యం ఇచ్చారు. ఆ తర్వాత రూ. 5 లక్షల చెక్కును అందించారు. అంతేకాకుండా.. వారికి ఎప్పుడూ తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. చిరంజీవి గొప్ప మనసుపై సినీ ప్రముఖులు.. అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.