
మోస్ట్ అవైటెడ్ సినిమా మన శంకరవరప్రసాద్ గారు. సూపర్ హిట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిన డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తోన్న ఈ పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ మూవీలో విక్టరీ వెంకటేశ్ అతిథి పాత్రలో కనిపించనున్నారు. దీంతో ఈ ప్రాజెక్ట్ పై మరింత క్యూరియాసిటీ పెరిగింది. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో తన స్టైల్లో ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. మొదటి నుంచి విభిన్న కంటెంట్లతో వీడియోస్ షేర్ చేస్తున్న డైరెక్టర్.. ఇప్పుడు మెయిన్ ప్రమోషనల్ కంటెంట్ చూపించేశారు. అదేమనండి. మెగా ఫ్యాన్స్ ఎప్పుడప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న ట్రైలర్ రిలీజ్ చేశారు.
ఇవి కూడా చదవండి : Megastar Chiranjeevi : అందుకే చిరంజీవితో సినిమా చేయలేదు.. అసలు విషయం చెప్పిన హీరోయిన్..
ఆదివారం సాయంత్రం తిరుపతిలోని ఎస్వీ సినీప్లెక్స్‌లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహిస్తుంది చిత్రయూనిట్. ఇందులో భాగంగానే ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకుంది చిత్రయూనిట్. తాజాగా విడుదలైన ట్రైలర్ అదిరిపోయింది. వింటేజ్ చిరు కామెడీ టైమింగ్.. అనిల్ రావిపూడి డైరెక్షన్ గురించి చెప్పక్కర్లేదు.
ఇవి కూడా చదవండి : Raasi: ఆ సినిమా వల్లే కెరీర్ నాశనమైంది.. మొదటి రోజే అలాంటి సీన్ చేయించారు.. హీరోయిన్ రాశి..
ఇక సోమవారం నుంచి ప్రమోషన్స్ వేగం పెంచనున్నారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. జనవరి 5న నెల్లూరిలో సెలబ్రేషన్స్ చేయనున్నారు. అలాగే 6న విశాఖపట్నం, 7న హైదరాబాద్, 8న తాడేపల్లిగూడెం, 9న అనంతపూర్, 10న వరంగల్, 11న బెంగళూరు ఇలా వరుసగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఇవి కూడా చదవండి : Actress : చిరంజీవి, మహేష్ బాబుతో సినిమాలు.. 51 ఏళ్ల వయసులో తరగని అందం.. క్యాన్సర్‌ను గెలిచి.. ఇప్పుడు ఇలా..
Meet #ManaShankaraVaraPrasadGaru
and celebrate the BIGGEST FAMILY ENTERTAINER of Sankranthi 2026 with you family in theatres ❤️🔥#MSGTrailer out now 💥💥💥GRAND RELEASE WORLDWIDE IN THEATERS ON 12th JANUARY 2026.#MSGonJan12th
Megastar @Kchirutweets… pic.twitter.com/3v0S28KiUr
— Shine Screens (@Shine_Screens) January 4, 2026
ఇవి కూడా చదవండి : Upendra : ఉపేంద్రతో ప్రేమాయణం.. ఇన్నాళ్లకు ఓపెన్ అయిన హీరోయిన్.. ఏమన్నారంటే..