
మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ సినిమా ‘మన శంకర వర ప్రసాద్ గారు’. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో నుంచే యునానిమస్ పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఇంకా హౌస్ ఫుల్ కలెక్షన్లతో రన్ అవుతోన్న ఈ మెగా మూవీ సక్సెస్ ఫుల్ గా 25 రోజులు పూర్తి చేసుకుంది. ఈనేపథ్యంలో మన శంకరవరప్రసాద్ గారు 25 రోజుల కలెక్షన్లను అధికారికంగా ప్రకటించారు నిర్మాతలు. ఈ మేరకు ఒక పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. మొదటివారంలోనే మన శంకర వరప్రసాద్ గారు రూ.292 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత కూడా జోరు కొనసాగించిన ఈ మెగా మూవీ కలెక్షన్లలో ఒక్కొక్క రికార్డును బద్దలు కొడుతూ వచ్చింది. ఇప్పుడు 25 రోజుల్లో రూ. 375 కోట్లు రాబట్టిన మన శంకరవరప్రసాద్ గారు ఆల్‌టైమ్ రీజనల్ ఇండస్ట్రీ రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు రూ. 300 కోట్ల కలెక్షన్స్‌తో సంక్రాంతికి వస్తున్నాం చిత్రం మొదటి స్థానంలో ఉంది. ఇప్పుడీ రికార్డును మన శంకరవరప్రసాద్ గారు అధిగమించింది.
ఇక ఓవర్సీస్‌లో కూడా మన శంకరవరప్రసాద్ గారు మూవీ సుమారు రూ. 5 మిలియన్ల డాలర్లు రాబట్టింది. తద్వారా చిరంజీవి కెరీర్ లోనే 5 మిలియన్ల డాలర్లు సాధించిన సినిమాగా ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డు నెలకొల్పింది. ఇక బుక్‌మైషోలో ఈ మూవీ టికెట్లు రికార్డు స్థాయిలో అమ్ముడుపోయాయి. కాగా ఇప్పటికీ చాలా చోట్ల మన శంకరవరప్రసాద్ గారు సినిమా హౌస్ ఫుల్ కలెక్షన్లతో ఆడుతోంది. మరోవైపు ఈ మెగా మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ను కూడా అధికారికంగా అనౌన్స్ చేశారు. ఫిబ్రవరి 11 నుంచి మన శంకరవరప్రసాద్ గారు మూవీ జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. మరి థియేటర్లలో రప్ఫాడించిన మన శంకరవరప్రసాద్ గారు ఓటీటీలో ఎన్ని రికార్డులు అందుకుంటుందో చూడాలి.
₹375Crores+ Gross & counting for the ALL-TIME REGIONAL INDUSTRY BLOCKBUSTER #MSG ❤️🔥❤️🔥❤️🔥
With immense love from audiences across the globe, it’s 25 GLORIOUS DAYS at the box office for #ManaShankaraVaraPrasadGaru 🔥
Book your tickets now and experience the blockbuster magic in… pic.twitter.com/Wlhqc77H3B
— Shine Screens (@Shine_Screens) February 5, 2026
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..