Bigg Boss Divi: మాట నిలబెట్టుకున్న మెగాస్టార్‌.. గాడ్‌ ఫాదర్‌లో మెరిసిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఏ పాత్రలోనంటే?

|

Oct 06, 2022 | 6:12 AM

బాలీవుడ్ సూపర్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌, టాలీవుడ్ హీరో సత్యదేవ్‌, నయనతార, పూరి జగన్నాథ్‌, మురళీ శర్మ, సముద్రఖని, సునీల్, బ్రహ్మాజీ, గంగవ్వ.. తదితరులు  గాడ్ ఫాదర్ సినిమాలో నటించారు. వీరితో పాటు ఓ ముద్దుగుమ్మ మెగాస్టార్ సినిమాలో తళుక్కుమంది.

Bigg Boss Divi: మాట నిలబెట్టుకున్న మెగాస్టార్‌.. గాడ్‌ ఫాదర్‌లో మెరిసిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఏ పాత్రలోనంటే?
Chiranjeevi,bigg Boss Divi
Follow us on

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా తెరకెక్కిన గాడ్‌ ఫాదర్‌ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ గా రూపొందించిన ఈ చిత్రానికి పాజిటివ్‌ టాక్‌ రావడంతో మెగా ఫ్యాన్స్‌ ఆనందానికి హద్దే లేకుండా పోయింది. బాలీవుడ్ సూపర్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌, టాలీవుడ్ హీరో సత్యదేవ్‌, నయనతార, పూరి జగన్నాథ్‌, మురళీ శర్మ, సముద్రఖని, సునీల్, బ్రహ్మాజీ, గంగవ్వ.. తదితరులు  గాడ్ ఫాదర్ సినిమాలో నటించారు. వీరితో పాటు ఓ ముద్దుగుమ్మ మెగాస్టార్ సినిమాలో తళుక్కుమంది. ఆమె మరెవరో కాదు.. బిగ్‌బాస్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దివి వద్యతా. ఈచిత్రంలో సునీల్‌ భార్య రేణుక పాత్రలో దివి కనిపించింది.

కాగా బిగ్‌బాస్‌ సీజన్‌-4లో పాల్గొన్న దివి తన ఫెర్మామెన్స్‌తో అందరినీ ఆకట్టుకుంది. విజేతగా నిలవకపోయినా తన అందం, ప్రవర్తనతో పలువురి మనసులు గెల్చుకుంది. ఇక ఆ సీజన్ ఫినాలేకి చీఫ్ గెస్ట్ గా హాజరైన మెగాస్టార్‌ చిరంజీవి సైతం దివిని చూసి మెస్మరైజ్‌ అయ్యారు. తన తదుపరి సినిమాలలో అవకాశం కల్పిస్తానని బిగ్‌బాస్‌ వేదికపైనే మాట ఇచ్చారు. తాజాగా ఈ మాటను నెరవేర్చుకున్నారు చిరంజీవి. కాగా మొదట భోళా శంకర్ సినిమాలో ఆమెకు పోలీసు అధికారి పాత్ర ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. అయితే అనూహ్యంగా గాడ్ ఫాదర్ సినిమాలో కీలకమైన పాత్రలో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది దివి.

ఇవి కూడా చదవండి

సినిమాను మలుపు తిప్పే పాత్రలో..

కాగా సినిమా విడుదలకు ముందే కొన్ని ప్రెస్‌మీట్లలో ద్వారా దివి నటిస్తుందన్న విషయం తెలిసినా ఏ పాత్రలో నటించింది అనే విషయం మీద స్పష్టత రాలేదు. తాజాగా చిత్రం విడుదల కావడం, అందులోనూ సినిమాను కీలక మలుపు తిప్పే పాత్రలో దివిని చూసి అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. మరోవైపు అనుకున్నట్లు మెగాస్టార్‌ తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..