Megastar Chiranjeevi: ఫ్యాన్స్ గుండెల్లో శాశ్వత ఖైదీని చేసిన సినిమా.. నా జీవితంలో టర్నింగ్ పాయింట్ అంటూ చిరు ట్విట్

|

Oct 28, 2023 | 5:30 PM

హీరో, డైనమిక్ హీరో, సుప్రీం హీరో నుంచి మెగాస్టార్ చిరంజీవి వరకూ సాగిన చిరంజీవి సినీ ప్రయాణంలో మైలు రాయిగా నిలిచిన సినిమాల్లో ఒకటి ఖైదీ. నేటితో (అక్టోబర్ 28వ తేదీ) ఖైదీ సినిమా రిలీజై 40 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా గుర్తు చేసుకున్నారు. ఓ ఎమోషనల్ ట్వీట్ చేశారు చిరు. 'ఖైదీ' చిత్రం నిజంగానే అభిమానుల గుండెల్లో నన్ను శాశ్వత 'ఖైదీ'ని  చేసింది. 

Megastar Chiranjeevi: ఫ్యాన్స్ గుండెల్లో శాశ్వత ఖైదీని చేసిన సినిమా.. నా జీవితంలో టర్నింగ్ పాయింట్ అంటూ చిరు ట్విట్
Chiranjeevi Khaidi Movie
Follow us on

ప్రాణం ఖరీదు సినిమాతో వెండి తెరపై అడుగు పెట్టి.. హీరోగా , విలన్ గా , చిన్న పెద్ద పాత్రల్లో నటిస్తూ తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ పేజీని లిఖించుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇంతింతై వటుడింతై ఎదిగినట్లు సినీ పరిశ్రమలో రెండు దశాబ్దాలకు పైగా నెంబర్ వన్ స్థానంలో నిలిచి నేటి తరానికి కూడా ఇన్స్పిరేషన్ గా నిలిచారు చిరంజీవి. ఎవరెస్టు శిఖరం ఎత్తున ఎదిగిన చిరంజీవి సినీ కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్స్, బ్లాక్ బస్టర్ మూవీస్ ఉన్నాయి. ఇండస్ట్రీ హిట్స్ తో ప్రస్తుతం వరస సినిమాలతో కెరీర్ లో బిజీగా ఉంటూ యంగ్ హీరోలకు సైతం పోటీగా నిలుస్తున్నారు. చిరు సినిమాలు అనగానే అందరికీ ముందుగా గుర్తుకొచ్చేది ఖైదీ అని  చెప్పవచ్చు.  హీరోగా నిలిబెట్టిన సినిమా  ఖైదీ. ఈ సినిమాతో చిరంజీవి స్టార్ హీరో రేంజ్ ను సొంతం చేసుకున్నారు. 1983 లో విడుదలైన ఈ సినిమా నేటి తో 40 ఏళ్లు పూర్తీ చేసుకుంది.

హీరో, డైనమిక్ హీరో, సుప్రీం హీరో నుంచి మెగాస్టార్ చిరంజీవి వరకూ సాగిన చిరంజీవి సినీ ప్రయాణంలో మైలు రాయిగా నిలిచిన సినిమాల్లో ఒకటి ఖైదీ. నేటితో (అక్టోబర్ 28వ తేదీ) ఖైదీ సినిమా రిలీజై 40 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా గుర్తు చేసుకున్నారు. ఓ ఎమోషనల్ ట్వీట్ చేశారు చిరు.

ఇవి కూడా చదవండి

‘ఖైదీ’ చిత్రం నిజంగానే అభిమానుల గుండెల్లో నన్ను శాశ్వత ‘ఖైదీ’ని  చేసింది.  తన జీవితంలో ఓ గొప్ప టర్నింగ్ పాయింట్ ఖైదీ సినిమా అంటూనే ఆ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించిన తీరు ఎప్పటికీ మరువలేనిది. ఖైదీ విడుదలై నేటికి 40 సంవత్సరాలయిన సందర్భంగా ఒక సారి ఆ జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ అంటూ ఆ సినిమాలోని పోస్టర్ ని తన ట్విట్టర్ లో షేర్ చేశారు చిరంజీవి.

ఖైదీ సినిమాకు దర్శకత్వం వహించిన  ఏ.కోదండరామిరెడ్డి, చిత్ర నిర్మాణ సంస్థ సంయుక్త మూవీస్ టీమ్, సినిమా రచయితలైన పరుచూరి సోదరులతో పాటు ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటించిన సుమలత, మాధవి తో పాటు ఖైదీ చిత్ర యూనిట్ కు అభినందనలు తెలిపారు.

వాస్తవానికి ఈ సినిమాకు ముందు చిరంజీవి హీరోగా చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పుడైతే ఖైదీ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిందో అప్పుడే చిరంజీవి స్టార్ హీరోగా మారిపోయారు.

ఈ సినిమా అక్టోబర్ 28వ తేదీ, 1983లో రిలీజై ప్రేక్షకుల ఆదరణను సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించండి. అనేక సెంటర్లలో 100 రోజులు పూర్తి చేసుకుని శతదినోత్సవ వేడుకలను జరుపుకుంది. అప్పట్లోనే ఖైదీ సినిమా రూ. 8కోట్ల కలెక్షన్లను వసూలు చేసినట్లు తెలుస్తోంది. కె. చక్రవర్తి సంగీతం అందించిన ఈ సినిమాలోని సాంగ్స్ నేటికీ ఆదరణ పొందుతూనే ఉన్నాయి. సినిమాలో రియలిస్టిక్ గా చేసిన ఫైట్స్ అప్పట్లో ఒక ట్రెండ్ సెట్ చేశాయి, పోలీస్ స్టేషన్లో ఫైట్, అడవిలో జరిగే యాక్షన్ సన్నివేశాలు తెలుగు సినిమాల్లో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టాయి.

ఇక పాటల్లో చిరంజీవి చేసిన డాన్స్ అయితే సినిమా మధ్యలో వచ్చే పాటలు ప్రేక్షకులు సిగరెట్లు త్రాగే బ్రేక్ టైమ్ గా ఉండే ధోరణికి స్వస్తి పలికింది ఆనాడు. సినిమాలో మొత్తం చిరంజీవి ఒన్ మ్యాన్ షో చేసి సినీ పరిశ్రమని తనవైపుకు తిప్పుకునేలా చేశారు చిరంజీవి.

ప్రసుత్తం మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ పెళ్లికోసం ఇటలీలో ఉన్నారు. ప్రస్తుతం 156 వ సినిమా పూజా కార్యక్రమం జరుపుకుంది. బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో జరుపుకోనున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..