Megastar Chiranjeevi : 100 రోజుల ముందుగానే మెగాస్టార్ పుట్టిన రోజు వేడుకలు షురూ చేసిన అభిమానులు..

|

May 07, 2021 | 12:28 PM

మెగాస్టార్ చిరంజీవి అభిమానులు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశవ్యాప్తంగా మెగాస్టార్ కు క్రేజ్ ఉంది...

Megastar Chiranjeevi : 100 రోజుల ముందుగానే మెగాస్టార్ పుట్టిన రోజు వేడుకలు షురూ చేసిన అభిమానులు..
Follow us on

Megastar Chiranjeevi :

మెగాస్టార్ చిరంజీవి అభిమానులు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశవ్యాప్తంగా మెగాస్టార్ కు క్రేజ్ ఉంది. ఆయన స్టైల్, ఆయన డాన్స్ లో గ్రెస్ వేరే లెవల్ అంతే… ఎంతమంది హీరోలొచ్చినా మెగాస్టార్ ను ఎవ్వరు మ్యాచ్ చేయలేరు అంటున్నారు అభిమానులు. ఇక మెగాస్టార్ సినిమా రిలీజ్ అవుతుందంటే ఫ్యాన్స్  హంగామా మాములుగా ఉండదు. కటౌట్స్ , పూలాభిషేకాలు, పాలాభిషేకాలతో మోతమోగిస్తారు ఫ్యాన్స్. ఇక చిరంజీవి పుట్టిన రోజైతే అది మెగాఫ్యాన్స్ కు పెద్ద పండగే. ఆయన 66వ పడిలో అడుగుపెట్టేందుకు సరిగ్గా ఇంకో 100 రోజులు ఉంది. 22 ఆగస్ట్ 2021 చిరు బర్త్ డే. మెగాస్టార్ పుట్టిన రోజుకు ఇంకా సమయం ఉంది కానీ అభిమానులు మాత్రం అప్పుడే సంబరాలు మొదలు పెట్టేసారు.

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు మరో వందరోజులుండగానే సెలబ్రేషన్స్ మొదలుపెట్టారు అభిమానులు. ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయంలో అఖిల భారత చిరంజీవి యువత ఆధ్వర్యంలో “చిరంజీవి జన్మదిన మహోత్సవాలు” ప్రారంభమయ్యాయి. ఇప్పుడున్న క్రైసిస్ లో ప్లాస్మా దానం ప్రచారం.. సీసీసీ ద్వారా కార్మికులకు వ్యాక్సినేషన్ వంటివి చేపట్టారు అభిమానులు. ఇక రక్త దానం.. నేత్రదానంపై ఎప్పటి నుంచో  ప్రచారం చేస్తున్నారు ఫ్యాన్స్. ఇక కరోనా కష్టకాలంలో ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు మెగాస్టార్. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, మాస్క్ లు , శానిటైజర్లు వాడుతూ.. భౌతికాదురాన్ని పట్టిస్తూ ఉండాలని సోషల్ మీడియా ద్వారా చిరు కోరుతూనే ఉన్నారు. ఇక చిరు సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాలో రామ్ చరణ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. అలాగే ఈ సినిమా తర్వాత వరుస సినిమాలను లైన్ లో పెట్టారు మెగాస్టార్.

మరిన్ని ఇక్కడ చదవండి :

Allu Arjun: పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’ తర్వాత ఐకాన్ స్టార్ ఏ దర్శకుడికి ఛాన్స్ ఇవ్వబోతున్నాడు..?

Nayanthara: ఓటీటీ లో రానున్న లేడీ సూపర్ స్టార్ సినిమా.. త్వరలో ప్రేక్షకుల ముందుకు నయన్ ‘నిజల్’

Actor Siddharth : బీజేపీ నేత ట్వీట్ కు ఘాటుగా రిప్లై ఇచ్చిన సిద్ధార్థ్.. ‘ఏరా.. సిగ్గుండాలి’ అంటూ..