Fish Venkat: ఫిష్ వెంకట్‌ దీనస్థితి చూసి చలించిపోయిన చిరంజీవి, రామ్ చరణ్.. వెంటనే ఫొన్లు చేసి మరీ..

|

Sep 07, 2024 | 11:21 AM

'తొడగొట్టు చిన్నా' అంటూ ఎన్టీఆర్ ఆది సినిమాల్లో గంభీరమైన గొంతుతో డైలాగ్ చెప్పిన ఫిష్ వెంకట్ ఇప్పుడు దీన స్థితిలో ఉన్నాడు. ఎన్నో వందలాది సినిమాల్లో తన అద్భుతమైన కామెడీతో అలరించిన ఆయన గత కొద్ది కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. సినిమా షూటింగులకు వెళ్లేందుకు శరీరం ఏ మాత్రం సహకరించకపోవడంతో ఇంటి దగ్గరే ఉంటున్నారీ కామెడి విలన్.

Fish Venkat: ఫిష్ వెంకట్‌ దీనస్థితి చూసి చలించిపోయిన చిరంజీవి, రామ్ చరణ్.. వెంటనే ఫొన్లు చేసి మరీ..
Chiranjeevi, Ram Charan, Fish Venkat
Follow us on

‘తొడగొట్టు చిన్నా’ అంటూ ఎన్టీఆర్ ఆది సినిమాల్లో గంభీరమైన గొంతుతో డైలాగ్ చెప్పిన ఫిష్ వెంకట్ ఇప్పుడు దీన స్థితిలో ఉన్నాడు. ఎన్నో వందలాది సినిమాల్లో తన అద్భుతమైన కామెడీతో అలరించిన ఆయన గత కొద్ది కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. సినిమా షూటింగులకు వెళ్లేందుకు శరీరం ఏ మాత్రం సహకరించకపోవడంతో ఇంటి దగ్గరే ఉంటున్నారీ కామెడి విలన్. దీనికి తోడు ఆర్థిక సమస్యలు కూడా చుట్టుముట్టడంతో సాయం కోసం దీనంగా వేడుకుంటున్నాడు. డయాబెటిక్, బీపీ సమస్యలు తలెత్తడం, కాలు పూర్తిగా ఇన్ఫెక్షన్ కు గురికావడంతో పాటు వెంకట్ రెండు కిడ్నీలూ ఫెయిల్ అయ్యాయి. ఇటీవల ఒక ప్రముఖ టీవీ ఛానెల్ అతని దీన స్థితిని వెలుగులోకి వచ్చింది. ఈ ఇంటర్వ్యూ వేదికగానే తన కుటుంబాన్ని ఆదుకోవాలని వేడుకున్నాడాయన. నటుడి పరిస్థితి చూసిన అభిమానులు, నెటిజన్లు ఎమోషనల్ అయ్యారు. సినీ ప్రముఖులు ఫిష్ వెంకట్ ఫ్యామిలీని ఆదుకోవాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలోప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు ఫిష్ వెంకట్ కు లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించారు.

ఇక ఎవరికైనా ఆపద వస్తే ‘నేనున్నాంటూ సాయం చేయడంలో ముందుండే మెగా ఫ్యామిలీ కూడా ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసిందట. మెగాస్టార్ చిరంజీవితో పాటు ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆఫీసుల నుంచి ఫిష్ వెంకట్ కు ఫోన్లు వెళ్లాయట. ఈ విషయాన్ని ఫిష్ వెంకటే వెల్లడించారు. ‘ మెగా ఫ్యామిలీ నాకు అండగా నిలిచింది. నా ఆరోగ్య పరిస్థితిని చూసి చిరంజీవి, రాంచరణ్ ఆఫీస్ నుంచి ఫోన్ చేశారు. వారు నా ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకొని నాకు ధైర్యన్నిచ్చారు. అందుకు నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను’ అని ఫిష్ వెంకట్ చెప్పుకొచ్చాడు. అలాగే ప్రముఖ నిర్మాత దిల్ రాజు కూడా ఫిష్ వెంకట్ కు ఫోన్ చేసి ఆరోగ్యంపై ఆరా తీశారట. మొత్తానికి ఫిష్ వెంకట్ పరిస్థితిపై మెగా ఫ్యామిలీ తో పాటు సినీ ప్రముఖులు స్పందించడంపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఫిష్ వెంకట్ త్వరగా కోలుకోని మళ్లీ సినిమాల్లో నటించాలని ఆకాంక్షిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

చిరంజీవి, రామ్ చరణ్ ల గురించి ఫిష్ వెంకట్ మాటల్లో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.