Chiranjeevi- Mahesh: ‘ఈ మధ్యకాలంలో ఇలాంటి సినిమా చూడలేదు.. ఫుల్‌గా ఎంజాయ్ చేశాం’: చిరంజీవి, మహేశ్ బాబు

|

Sep 15, 2024 | 11:29 AM

ముఖ్యంగా యంగ్ హీరోల సినిమాలను చూసి వాటి రివ్యూలను చెబుతుంటారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి, మహేశ్ బాబు ఒక సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. చాలా రోజుల తర్వాత మంచి కామెడీ సినిమాను చూశామని, ఆద్యంతం ఫుల్ గా ఎంజాయ్ చేశామన్నారు. ఆ సినిమా మరేదో కాదు

Chiranjeevi- Mahesh: ఈ మధ్యకాలంలో ఇలాంటి సినిమా చూడలేదు.. ఫుల్‌గా ఎంజాయ్ చేశాం: చిరంజీవి, మహేశ్ బాబు
Chiranjeevi, Mahesh Babu
Follow us on

మెగాస్టార్ చిరంజీవి, మహేశ్ బాబు.. వేర్వేరు జనరేషన్స్‌కు చెందిన ఈ స్టార్ హీరోలకు అశేష అభిమానులు ఉన్నారు. సినిమాల సంగతి పక్కన పెడితే.. వీరు తోటి నటీనటులను ప్రోత్సహించడంలో చాలా ముందుంటారు. ముఖ్యంగా యంగ్ హీరోల సినిమాలను చూసి వాటి రివ్యూలను చెబుతుంటారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి, మహేశ్ బాబు ఒక సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. చాలా రోజుల తర్వాత మంచి కామెడీ సినిమాను చూశామని, ఆద్యంతం ఫుల్ గా ఎంజాయ్ చేశామన్నారు. ఆ సినిమా మరేదో కాదు రాజమౌళి తనయుడు శ్రీ సింహా కోడూరి హీరోగా నటించిన రీసెంట్‌ మూవీ ‘మత్తు వదలరా 2’. రితేశ్‌ రానా దర్శకుడు తెరకెక్కించిన ఈ క్రైమ్‌ కామెడీ మూవీలో కమెడియన్ సత్య మరో కీలక పాత్ర పోషించాడు. అలాగే జాతిరత్నాలు బ్యూటీ ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించింది. సెప్టెంబర్‌ 13న ప్రేక్షకుల ముందకు వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. ముఖ్యంగా సత్య తన కామెడీతో ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించాడు. ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవి, మహేశ్ బాబులు ఈ మూవీని చూసి సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

 

ఇవి కూడా చదవండి

‘నిన్ననే ‘మత్తు వదలరా 2’ చూశాను. ఈ మధ్య కాలంలో మొదటి నుంచి చివరిదాకా ఇంతలా నవ్వించిన సినిమా నాకు కనపడలేదు. ఎండ్‌ టైటిల్స్‌ కూడా వదలకుండా చూశా. ఈ క్రెడిట్ అంతా చిత్ర దర్శకుడు రితేష్ రాణాకు చెందుతుంది. అతడు రాత, తీత, కోత, మోత, ప్రతీది చక్కగా బ్యాలెన్స్ చేస్తూ మనకు వినోదాన్ని అందించిన విధానాన్ని అభినందించకుండా ఉండలేం. హ్యాట్సాఫ్‌ రితేశ్‌.. శ్రీ సింహా కోడూరి, ముఖ్యంగా సత్యకు నా అభినందనలు. ఫరియా అబ్దుల్లా, ఇతర నటీనటులు, సంగీత దర్శకుడు కాలభైరవతోపాటు మంచి విజయాన్ని అందుకున్న మైత్రి మూవీ మేకర్స్‌ సంస్థకు నా అభినందనలు. అస్సలు మిస్‌ కావద్దు. 100 శాతం ఎంటర్‌టైన్‌మెంట్‌ గ్యారంటీ’ అని చిరంజీవి ట్వీట్‌ చేశారు.

మెగాస్టార్ చిరంజీవి ట్వీట్..

ఇక మహేశ్ బాబు ఇలా రాసుకొచ్చారు. ‘మత్తు వదలరా 2’ మంచి వినోదాన్ని అందించింది. ఆద్యంతం నేను ఎంజాయ్‌ చేశా. సింహా కోడూరితోపాటు నటీనటులందరి ప్రదర్శన చాలా బాగుంది. వెన్నెల కిషోర్‌.. నువ్వు తెరపై కనిపించినంతసేపు నా కుమార్తె నవ్వు ఆపులేకపోయింది. సత్య.. నీ ప్రదర్శన చూసి మేమంతా నవ్వుకున్నాం. అద్భుతంగా నటించావు. టీమ్‌ అందరికీ నా అభినందనలు’ అని మత్తు వదలరా 2 టీమ్‌ ను ప్రశంసించారు.

 

మహేశ్ ప్రశంసలు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.