Acharya Movie: బాస్ ఈజ్ బ్యాక్.. థియేటర్లలో ఆచార్య సందడి.. ఫ్యాన్స్ ఆందోళన.. ఎందుకంటే..

|

Apr 29, 2022 | 3:02 PM

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi).. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కలిసి నటిస్తే చూడాలన్న అభిమానుల కల ఈరోజుతో నెరవేరింది.

Acharya Movie: బాస్ ఈజ్ బ్యాక్.. థియేటర్లలో ఆచార్య సందడి.. ఫ్యాన్స్ ఆందోళన.. ఎందుకంటే..
Acharya
Follow us on

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi).. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కలిసి నటిస్తే చూడాలన్న అభిమానుల కల ఈరోజుతో నెరవేరింది. ఎన్నో అంచానాల మధ్య తెరకెక్కిన చిరు సతీమణి సురేఖమ్మ డ్రీమ్ ప్రాజెక్ట్ ఆచార్య. ఈ సినిమాను మాస్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిగా.. కొణిదల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి. మొదటి నుంచి ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా ఏప్రిల్ 29న ప్రపంచవ్యాప్తంగా మెగాస్టార్‌ ఆచార్య ప్రేక్షకుల ముందుకొచ్చేసింది. చిరంజీవి, చరణ్‌ కలిసి నటించిన ఆచార్య సినిమా రిలీజవడంతో..మెగా అభిమానులు థియేటర్స్‌ వద్ద సందడి చేస్తున్నారు. ఐతే అనంతపురంలో SV సినీ మ్యాక్స్ వద్ద చిరంజీవి అబిమానులు అందోళనకు దిగారు. మూవీ టికెట్ల ధరలు 200 రూపాయలు అయితే 600కు అమ్మారంటూ ఆరోపిస్తున్నారు. SV థియేటర్లో అధిక ధరలకు టికెట్లు అమ్మారని..సినిమా నాలుగు ఐదు సార్లు నిలిపి వేశారంటూ నిరసన తెలిపారు మెగా ఫ్యాన్స్‌. ఫర్మిషన్ లేకుండా సినిమా ఏలా వేస్తారంటు గొడవకు దిగారు. ఇంత జరుగుతున్నా రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. కలెక్టర్ వచ్చి థియేటర్ యజమానులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

కడప జిల్లాలో ఆచార్య టికెట్లను ఎక్కువ ధరలకు అమ్మకూడదని థియేటర్ల యజమానులకు కౌన్సిలింగ్ ఇచ్చారు జమ్మలమడుగు ఆర్డిఓ శ్రీనివాసులు. పులివెందుల తహసీల్దార్ కార్యాలయంలో సినిమా థియేటర్ల యజమానులతో సమావేశమయ్యారు. అధిక ధరలకు టిక్కెట్లు అమ్మితే కేసులు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా 2 వేలకు పైగా స్క్రీన్స్‌లో విడుదలైంది ఆచార్య. బాస్‌ ఈజ్‌ బ్యాక్‌ అంటూ పండుగ చేసుకుంటున్నారు అభిమానులు. చిరు, చరణ్‌ను కలిసి బిగ్‌ స్క్రీన్‌మీద చూడాలనుకున్న తమ కల నెరవేరడంతో థియేటర్స్‌ వద్ద రచ్చ రచ్చ రచ్చ చేస్తున్నారు. తండ్రీ కొడుకుల స్టెప్పులు చూసేందుకు థియేటర్స్‌కు క్యూ కట్టారు. సినిమాకు హిట్‌ టాక్‌ రావడంతో మరింత జోష్‌లో ఉన్నారు మెగా ఫ్యాన్స్‌. థియేటర్స్‌ వద్ద చిరంజీవి, చరణ్‌ భారీ కటౌట్స్‌ ఏర్పాటుచేసి పాలాభిషేకాలు చేస్తున్నారు. కటౌట్స్‌కు హారతులు పడుతున్నారు. హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌లోని సంధ్యా ధియేటర్‌ వద్ద మెగా ఫ్యాన్స్‌ కోలాహలం నెలకొంది. కేరింతలు కొడుతూ..డాన్సులు చేస్తూ హంగామా చేస్తున్నారు.

ఏపీలో మెగా ఫ్యాన్స్‌ హంగామా అంతా ఇంతా కాదు. కోనసీమ జిల్లాలో ఆచార్య రిలీజ్‌ సందర్భంగా థియేటర్స్‌ వద్ద హల్‌చల్‌ చేస్తున్నారు మెగా అభిమానులు. కొన్ని థియేటర్లలో ఆరు షోలకు పర్మిషనివ్వడంతో సిల్వర్‌ స్క్రీన్‌పై తమ బాస్‌ను చూసేందుకు బారులు తీరారు. డిఫరెంట్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన సినిమా కావడం…తండ్రీకొడుకులు చిరు-చరణ్..సినిమా మొత్తం కనిపించడంతో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మెగా ఫ్యాన్స్‌తో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా మూవీ సూపర్‌ అంటూ ట్వీట్స్‌ చేస్తున్నారు. చిరు డైలాగులతో అదరగొడుతున్నారు అభిమానులు. రాయల్‌ మెగాస్టార్‌ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఫైట్స్, చిరు స్టెప్స్ సూపర్బ్ అంటూ ట్వీట్ చేస్తున్నారు మరికొందరు. ఓవర్సీస్‌తో పాటు పలు చోట్ల ఆచార్య మూవీని చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాలను షేర్‌ చేసుకుంటున్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజానగరంలో ఆచార్య మూవీతో అన్ని హంగులతో బెలూన్ థియేటర్ అందుబాటులోకొచ్చింది..ఈ వినూత్న బెలూన్ థియేటర్‌ను ఆచార్య ట్రైలర్‌తో ప్రారంభించింది పిక్చర్ టైమ్ సంస్థ. వెరైటీగా బెలూన్‌ థియేటర్‌లో తమ బాస్‌ మూవీని చూసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు ఫ్యాన్స్‌.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Also Read: Acharya Movie Review: ఆచార్య అంచనాల సంచలనాలను అందుకున్నాడా.? మెగా మూవీ ఎలా ఉందంటే..

Acharya: మెగాస్టార్ ‘ఆచార్య’ సినిమాకోసం ట్రెండ్ అయిన ఐదుగురు భామలు వీరే

Tollywood : సౌత్ సినిమాలే శరణం అంటున్న బాలీవుడ్.. రీమేక్స్‌ వెంటపడుతున్న నార్త్ మేకర్స్‌

Siddhu Jonnalagadda : ఆ మలయాళ రీమేక్‌కు డీజే స్టార్ నో చెప్పారా..? కారణం ఇదేనా..?