Radhe Shyam Movie: ‘రాధేశ్యామ్’ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది.. ఆ మెగా హీరోను టెన్షన్‌లోకి నెట్టింది

|

Feb 15, 2021 | 12:41 PM

ప్రేరణతో తన ప్రేమగురించి ఓపెన్‌గా చెప్పేశారు విక్రమాదిత్య... వేల మంది ఉన్న రైల్వే స్టేషన్‌లో అరిచి మరి ప్రపోజ్‌ చేశారు. డార్లింగ్ ప్రభాస్ ఇలాంటి క్యారెక్టర్‌లో కనిపించి పదేళ్లకు పైనే అవుతోంది.

Radhe Shyam Movie: రాధేశ్యామ్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది.. ఆ మెగా హీరోను టెన్షన్‌లోకి నెట్టింది
Radhe-Shyam
Follow us on

ప్రేరణతో తన ప్రేమగురించి ఓపెన్‌గా చెప్పేశారు విక్రమాదిత్య… వేల మంది ఉన్న రైల్వే స్టేషన్‌లో అరిచి మరి ప్రపోజ్‌ చేశారు. డార్లింగ్ ప్రభాస్ ఇలాంటి క్యారెక్టర్‌లో కనిపించి పదేళ్లకు పైనే అవుతోంది. అప్పుడెప్పుడో డార్లింగ్ సినిమాలో కాజల్‌ వెంట పడ్డ ప్రభాస్ ఇప్పుడు పూజా హెగ్డే కోసం రాధేశ్యామ్ సినిమాలో రోమియోగా మారారు.

బాహుబలి, సాహో లాంటి యాక్షన్‌ హంగామా తరువాత రాధేశ్యామ్ మూవీలో కూల్‌ అండ్‌ లవ్లీ విక్రమాదిత్యగా నటిస్తున్నారు ప్రభాస్‌. ఇప్పటికే అమర ప్రేమగాథ అన్న హింట్ ఇచ్చిన మేకర్స్‌.. టీజర్‌లోనూ అదే ఫ్లేవర్‌ను చూపించారు. చాలా రోజుల తరువాత డార్లింగ్‌ను లవర్ భాయ్‌గా చూపించడంతో ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు.

ఇదంతా ఓకే గానీ… రాధేశ్యామ్ టీజర్‌ మెగా ఫ్యాన్స్‌ను టెన్షన్‌లోకి నెట్టేసింది. జూలై 30న రాధేశ్యామ్ రిలీజ్.. అంటూ డేట్‌ ఇచ్చేశారు. కానీ ఇప్పటికే ఆ డేట్‌కి గని సినిమాను రిలీజ్‌ చేస్తున్నట్టుగా ఎనౌన్స్‌ చేశారు వరుణ్‌ తేజ్‌. సడన్‌గా ప్రభాస్‌ సీన్‌లోకి రావటంతో వరుణ్ తప్పుకోవాల్సిన పరిస్థితి. మాట్లాడుకొని అడ్జస్ట్‌ చేసుకోవాలన్నా… ప్రభాస్‌ సినిమా అంటే పాన్ ఇండియా వ్యవహారం.. ఆ లెక్కలు వేరే ఉంటాయి. సో… ఇప్పుడు బాల్‌ ‘గని’ కోర్టులో ఉందన్నమాట.

Also Read:

Kalyan Ram’s new film: దూసుకుపోతున్న ‘మైత్రీ మూవీ మేకర్స్’.. కల్యాణ్​రామ్​తో కొత్త సినిమా ప్రారంభం

వాలంటైన్స్ డే: తమ కలలరాణి నిధి అగర్వాల్‌కు గుడి కట్టి, అభిమానుల పాలాభిషేకం.. షాక్‌కు గురైన నటి