AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే స్పెషల్.. మెగా అభిమానుల కీలక నిర్ణయం.. ప్రశంసలు

ఉగాది కంటే ముందే మెగా అభిమానులకు మరో పండగ రానుంది. అదే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు (మార్చి 27). ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మెగా అభిమానులు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు.

Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే స్పెషల్.. మెగా అభిమానుల కీలక నిర్ణయం.. ప్రశంసలు
Ram Charan Birthday
Basha Shek
|

Updated on: Apr 01, 2025 | 9:28 PM

Share

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఈ గురువారం (మార్చి 27) తన పుట్టిన రోజు జరుపుకోనున్నారు. ఈ నేపథ్యంలో చెర్రీ బర్త్ డే వేడుకలను ఘనంగా సెలబ్రేట్ చేసేందుకు మెగా అభిమానులు రెడీ అవుతున్నారు. మెగాభిమానులంటేనే సేవకు మారుపేరు. ఈ క్రమంలోనే చెర్రీ పుట్టిన రోజున పలు సేవా కార్యక్రమాలు చేపట్టేలా ప్రణాళికలు రచించారు. అన్నదానం, రక్తదానం తదితర సేవా కార్యక్రాలను ప్లాన్ చేశారు. వీటితో పాటు సామాజిక స్పృహతో మెగాభిమానులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే.. మార్చి 27వ తేదీన అఖిల భారత చిరంజీవి యువత ఆధ్వర్యంలో మెగా అభిమానులంతా మొక్కలు నాటాలని నిర్ణయించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పిలుపునిచ్చారు. ‘మొక్కలు నాటుదాం.. పర్యావరణాన్ని కాపాడుదాం.. వృక్షాలుగా ఎదగనిద్దాం.. భవిష్యత్ తరాలకు నీడనిద్దాం’ అని నెట్టింట పోస్ట్ పెట్టారు. దీంతో మెగాభిమానుల నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

ఇక సినిమాల విషయానికి వస్తే.. గేమ్ ఛేంజర్ సినిమాతో మెగాభిమానులు కాస్త నిరాశకు లోనయ్యారు. దీంతో వారి ఆశలన్నీ ఇప్పుడు ఆర్ సీ 16 సినిమాపైనే ఉన్నాయి. ఈ క్రమంలో రామ్ చరణ్ పుట్టిన రోజున ఆర్ సీ 16 నుంచి కూడా అప్డేట్ ఉంటుందని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా టైటిల్ తో పాటు టీజర్ లేదా గ్లింప్స్ రిలీజేయ్య అవకాశముందని తెలుస్తోంది. దీనిపై చిత్ర బృందం నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఆర్ సీ 16 సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, మీర్జాపూర్ వెబ్ సిరీస్ ఫేమ్ దివ్యేందు త్రిపాఠీ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ స్వరాలు సమకూరుస్తుండడం విశేషం.

ఆర్ సీ 16 సెట్ లో..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి . .

Follow Us
మీ ఊర్లో వానలు పడుతున్నాయా? ఈ పండ్లు తినండి.. అనారోగ్యాలు రావండి
మీ ఊర్లో వానలు పడుతున్నాయా? ఈ పండ్లు తినండి.. అనారోగ్యాలు రావండి
బస్టాండ్‌ నుండి బయల్దేరిన కాసేపటికే బస్సులో మంటలు
బస్టాండ్‌ నుండి బయల్దేరిన కాసేపటికే బస్సులో మంటలు
ఈ ఒక్క జ్యూస్‌తో ఫిట్‌నెస్, ఆరోగ్యం రెండూ మీ సొంతం.. సూపర్ టానిక్
ఈ ఒక్క జ్యూస్‌తో ఫిట్‌నెస్, ఆరోగ్యం రెండూ మీ సొంతం.. సూపర్ టానిక్
ప్రియుడితో బ్రేకప్.. బిగ్‌బాస్ తెలుగు 10లోకి జబర్దస్త్ బ్యూటీ!
ప్రియుడితో బ్రేకప్.. బిగ్‌బాస్ తెలుగు 10లోకి జబర్దస్త్ బ్యూటీ!
ఆ హీరో సినిమా వల్లే నాకు విపరీతమైన క్రేజ్ వచ్చింది..
ఆ హీరో సినిమా వల్లే నాకు విపరీతమైన క్రేజ్ వచ్చింది..
నెల్లూరు సెంట్రల్ జైల్లో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
నెల్లూరు సెంట్రల్ జైల్లో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
వర్షాకాలం అంతా మల్లెపూలు బాగా పూయాలంటే ఈ 3 కలిపి ఇవ్వండి..
వర్షాకాలం అంతా మల్లెపూలు బాగా పూయాలంటే ఈ 3 కలిపి ఇవ్వండి..
సచిన్ తర్వాత హిస్టరీ క్రియేట్ చేసిన రూట్
సచిన్ తర్వాత హిస్టరీ క్రియేట్ చేసిన రూట్
మాయ మామిడి పండు రహస్యం.. స్వార్థం కాదు సేవే శాశ్వతమని చెప్పే కథ
మాయ మామిడి పండు రహస్యం.. స్వార్థం కాదు సేవే శాశ్వతమని చెప్పే కథ
యశ్ 'టాక్సిక్' కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. అధికారిక ప్రకటన
యశ్ 'టాక్సిక్' కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. అధికారిక ప్రకటన