AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Peddi Movie : ఇదేం అభిమానం సామీ.. పెద్ది రిలీజ్.. థియేటర్ వద్ద రామ్‌చరణ్‌కి గుడి కట్టేశారు..

మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ పెద్ది.. మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్న ఈ మూవీ విడుదల కానుండడంతో మెగా ఫ్యాన్స్ సంతోషానికి అవధులు లేవు. దీంతో కొందరు ఫ్యాన్స్ ఏకంగా రామ్ చరణ్ కు గుడి కట్టేశారు. అందులో పెద్ది విగ్రహం ఏర్పాటు చేసి పూజలు నిర్వహిస్తున్నారు.

Peddi Movie : ఇదేం అభిమానం సామీ.. పెద్ది రిలీజ్.. థియేటర్ వద్ద రామ్‌చరణ్‌కి గుడి కట్టేశారు..
Ram Charan
Rajitha Chanti
|

Updated on: Jun 03, 2026 | 12:36 PM

Share

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ (Peddi) విడుదల సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో అభిమానుల కోలాహలం అంబరాన్ని తాకుతోంది. జూన్ 4న ఈసినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుండగా.. జూన్ 3న సాయంత్రం తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్స్ వేయనున్నారు. టాలీవుడ్‌లో పెద్ద సినిమాల హంగామాకు, మాస్ సెలబ్రేషన్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే హైదరాబాద్ కూకట్‌పల్లిలోని అర్జున్ థియేటర్ వద్ద మెగా అభిమానులు సరికొత్త రికార్డు సృష్టించారు. సినిమా రిలీజ్ కాకముందే థియేటర్ ఆవరణలో గుడి కట్టి అందులో రామ్ చరణ్ భారీ విగ్రహాన్ని ప్రతిష్టించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. సాధారణంగా స్టార్ హీరోల సినిమాలు విడుదలవుతున్నాయంటే థియేటర్ల వద్ద భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం చూస్తుంటాం. కానీ ఈసారి కూకట్‌పల్లి మెగా ఫ్యాన్స్ ఒక అడుగు ముందుకు వేసి వినూత్నంగా ప్లాన్ చేశారు. ‘పెద్ది’ సినిమాలో రామ్ చరణ్ పవర్‌ఫుల్ రస్టిక్ మాస్ లుక్‌ను ప్రతిబింబించేలా ఒక భారీ విగ్రహాన్ని థియేటర్ ముందే ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఆ విగ్రహం వద్ద ‘శ్రీ కొణిదెల వారి ఆలయం’, ‘శ్రీ రామ్‌చరణ్ ఆలయం’ అంటూ ప్రత్యేకంగా ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేయడం విశేషం.

ఎక్కువమంది చదివినవి : ఏం సినిమా రా బాబూ.. ఒక్కో సీన్ ఊపిరి బిగపట్టి చూడాల్సిందే.. ఓటీటీలో రచ్చ చేస్తున్న మలయాళీ

ఈ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా అర్జున్ థియేటర్ పరిసర ప్రాంతమంతా ఒక పెద్ద జాతరను తలపిస్తోంది. భారీ సంఖ్యలో తరలివచ్చిన అభిమానులు క్రేన్ల సహాయంతో విగ్రహానికి భారీ పూలదండలు వేసి, క్షీరాభిషేకాలు (పాలాభిషేకం) చేస్తూ పండుగ చేసుకుంటున్నారు. థియేటర్ గేటు ముందు గుమ్మడికాయలు కొట్టడం, కర్పూర హారతులు ఇవ్వడం, రంగుల కాగితాలు చల్లడంతో ఆ ప్రాంతమంతా మార్మోగిపోతోంది. దారి వెంట వెళ్లే వాహనదారులు సైతం కాసేపు ఆగి ఈ అపూర్వ దృశ్యాన్ని ఆశ్చర్యంగా చూస్తూ ఫొటోలు తీసుకుంటున్నారు.

ఎక్కువమంది చదివినవి : Maheswari: ఆ హీరో అంటే క్రష్.. పిచ్చిగా ప్రేమించా.. చెల్లి అని మనసు ముక్కలు చేశాడు.. హీరోయిన్ మహేశ్వరి..

ప్రస్తుతం అర్జున్ థియేటర్ వద్ద జరుగుతున్న ఈ మెగా మాస్ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి. గ్లోబల్ మెగా ఫ్యాన్స్ #PeddiTakeOver అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఈ విజువల్స్‌ను ప్రపంచవ్యాప్తంగా వైరల్ చేస్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ వంటి అంతర్జాతీయ విజయం తర్వాత చరణ్ నటిస్తున్న పక్కా రా అండ్ రస్టిక్ విలేజ్ స్పోర్ట్స్ డ్రామా కావడం, ఇప్పటికే యూఎస్‌లో ప్రీ-సేల్స్‌తో మిలియన్ డాలర్ల క్లబ్‌లోకి చేరడంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ ఊపు చూస్తుంటే బాక్సాఫీస్ వద్ద ‘పెద్ది’ సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

ఎక్కువమంది చదివినవి : Raghavendra Rao : అది గొప్ప పాట.. జీవితాంతం గుర్తుంచుకోవాల్సిన సాంగ్.. రాఘవేంద్ర రావు మనసులో నిలిచిపోయిన పాట ఇదే..

ఎక్కువమంది చదివినవి : Reema Sen : ఇండస్ట్రీలో అతడే నాకు బెస్ట్ ఫ్రెండ్.. ప్రతి విషయంతో తనతోనే షేర్ చేసుకుంటాను.. రీమా సేన్..

Follow Us