
మెగాస్టార్ చిరంజీవి.. ఇప్పుడు పద్మ విభూషణుడు. ఈ ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్రం ఆయనకు దేశంలోని అత్యున్నత పౌర పురస్కారం అందించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయనకు సోషల్ మీడియా వేదికగా అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇప్పటికే పలువురు చిరంజీవిని స్వయంగా కలిసి అభినందనలు తెలుపుతున్నారు. అలాగే త్వరలోనే ఓ మెగా ఫంక్షన్ ఏర్పాటు చేసి చిరంజీవిని గౌరవించనున్నట్లు నిర్మాత దిల్ రాజు ప్రకటించారు. ఇంకా చిరు నివాసంలో ఆయనను కలిసి విష్ చేస్తున్నారు. దర్శక నిర్మాతలు, టాలీవుడ్ హీరోస్ చిరుకు విషెస్ తెలిపారు. తాజాగా ఓ అభిమానికి చిరుకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. కుందవరపు శ్రీనివాస్ అనే వ్యక్తి.. అమెరికాలోని ప్రఖ్యాత న్యూయార్క్ టైం స్క్వేర్ స్ట్రీట్ లోని బిగ్ స్క్రీన్ పై చిరంజీవి ఫోటో ప్రదర్శించి.. ఎంతో ప్రతిష్టాత్మక అవార్డు అయిన పద్మ విభూషణ్ పురస్కారాన్ని ఎంపికైన చిరుకు అభినందనలు తెలుపుతూ తన అభిమానాన్ని చాటుకున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది.
2006 లో పద్మ భూషణ్ అవార్డ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత డాక్టరేట్ కూడా అందుకున్నారు. ఇప్పుడు దేశంలోనే రెండో అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ వరించడంతో మెగా ఫ్యామిలీ ఆనందానికి అవధులు లేవు. టాలీవుడ్ సినీ పరిశ్రమలో ముందుగా పద్మ విభూషణ్ అవార్డ్ అక్కినేని నాగేశ్వర్ రావు అందుకున్నారు. ఆ తర్వాత ఈ పురస్కారం అందుకున్న హీరో చిరంజీవి కావడం విశేషం.
ఇదిలా ఉంటే..ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ఈ చిత్రానికి వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. ఫ్యాంటసీ అడ్వెంచర్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఇందులో చిరు జోడిగా త్రిష నటించనుందని టాక్ వినిపిస్తుంది. విశ్వంభర సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Fans Congratulated MegaStar Dr. @KChiruTweets garu from the Times Square, USA on receiving prestigious #PadmaVibhushan 😍#PadmaVibhushanChiranjeevi #PeoplesPadma pic.twitter.com/VEhJI7IfKl
— KB (@Shatagni) January 30, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.