Pawan Kalyan: సాయి ధరమ్ తేజ్ అల్లరి మాములుగా లేదుగా.. పవన్ రియాక్షన్ చూడండి

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి అఖండ విజయం దక్కింది. జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లో విజయం సాధించింది. పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో గెలుపొందారు. పవన్ గెలుపుతో ఆయన అభిమానులు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ విజయం సాధించడంతో రెండు రాష్ట్రాల ప్రజలు పండగ చేస్తుంటున్నారు.  

Pawan Kalyan: సాయి ధరమ్ తేజ్ అల్లరి మాములుగా లేదుగా.. పవన్ రియాక్షన్ చూడండి
Pawan Kalyan

Updated on: Jun 07, 2024 | 8:50 AM

జూన్ 4న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఫలితాల్లో కూటమి ఘనవిజయం సాధించింది. 175 నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీ వైసీపీ 11 నియోజకవర్గాల్లో మాత్రమే విజయం సాధించింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 164 నియోజకవర్గాల్లో భారీ విజయాలను అందుకుంది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి అఖండ విజయం దక్కింది. జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లో విజయం సాధించింది. పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో గెలుపొందారు. పవన్ గెలుపుతో ఆయన అభిమానులు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ విజయం సాధించడంతో రెండు రాష్ట్రాల ప్రజలు పండగ చేస్తుంటున్నారు.

పవన్ కళ్యాణ్ విజయం సాధించిన తర్వాత మెగా ఫ్యామిలి పండగ వాతావరణం నెలకొంది. రీసెంట్ గా పవన్ భార్య, కొడుకు అకీరా నందన్ తో కలిసి మోడీని కలిశారు. ఇక మెగా ఫ్యామిలీ లో పవన్ గెలవడంతో మెగా ఫ్యామిలి ఆనందంలో తేలిపోతున్నారు. తాజాగా మెగా ఫ్యామిలీ పవన్ కళ్యాణ్ కు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. చిరంజీవికి పవన్ కళ్యాణ్ పాదాభివందనం చేశారు. చిరంజీవి కాళ్ళమీద పడి పవన్ ఆశీర్వాదం తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ తన భార్య అన్నా లెజనోవా, తనయుడు అకిరా నందన్ తో కలిసి చిరంజీవి ఇంటికి వెళ్లారు.

పవన్ ఇంటికి రాగానే ఫ్యామిలీ మెంబర్స్ అంతా సంబరం చేసుకున్నారు. పవన్ పూలు జల్లి వెల్కమ్ చెప్పారు. అనంతరం కేక్ కట్ చేసి సందడి చేశారు. ఈ సందడిలో సాయి ధరమ్ తేజ్, అకీరా అల్లరి చేశారు. వెనకాల సాయి ధరమ్ తేజ్ విజిల్స్ వేస్తూ సందడి చేశాడు. ఆపకుండా తేజ్ విజిల్స్ వేస్తూ అల్లరి చేయడంతో పవన్ ఓ లుక్ ఇచ్చాడు. దాంతో తేజ్ సారి మావయ్య అని చెప్పాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సాయి ధరమ్ తేజ్ కు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. ఎన్నికల్లో గెలిచాక కూడా సాయి ధరమ్ తేజ్ మామయ్య ఇంటికి వెళ్లి పవన్ ని ఎత్తుకొని తిప్పాడు. ఈ ఇద్దరూ కలిసి బ్రో అనే సినిమాలోనూ నటించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.