పవన్ కల్యాణ్.. తెలుగు చిత్ర పరిశ్రమలో ఆయనో తిరుగులేని స్టార్. మధ్యలో వరుసగా సినిమాలు ఫ్లాపులు అయినా ఆయన స్టార్ డమ్ మాత్రం పెరిగిపోతూ వచ్చింది. చిరు తమ్ముడిగా ఇండస్ట్రీకి పరిచయమైననప్పటికీ, పవర్ స్టార్‌గా తనకు తాను ఓ స్థాయి ఏర్పాటు చేసుకున్నాడు కల్యాణ్ బాబు. ఆయన సినిమాలు విభిన్నం.. ఆయన స్టైల్ అంతకు మించి. ఇక పవన్ వ్యక్తిత్వం గురించి చెప్పేది ఏముంది. సాయం అంటే చాలు ఎగబడి ముందుకు వచ్చేస్తాడు. ఎంతోమందికి గుప్త దానాలు చేశాడు. దేశం కోసం తన ప్రాణం సైతం అర్పిస్తా అని ముందుకు వస్తాడు. ప్రజంట్ జనసేన పార్టీతో ప్రజల్లోకి వెళ్తే ప్రయత్నం చేస్తున్నారు పవన్. మరోవైపు వరసబెట్టి సినిమాలు కూడా చేస్తున్నారు.
టాలీవుడ్‌లో టాప్ హీరోగా ఉన్న పవన్ ఒక్క సినిమాకు తీసుకునే రెమ్యూనరేషన్ 50 నుంచి 60 కోట్ల మధ్య ఉంటుందని ఇండస్ట్రీ టాక్. మరి ఇంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్న పవన్.. ఆస్తుల విలువ ఎంత ఉంటుందన్నది చాలామంది డౌట్. ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు మెగా బ్రదర్ నాగబాబు. పవన్‌కు ఆస్తులకన్నా అప్పులే ఎక్కువగా ఉన్నాయంటూ బాంబ్ పేల్చారు. పవన్ ఇల్లు కూడా లోన్‌పై తీసుకున్నదే అని చెప్పుకొచ్చారు. పవన్‌కు కార్లు ఉన్నప్పటికీ అవి కూడా లోన్లో తీసుకున్నవేనని వెల్లడించారు.
ప్రస్తుతం ఎలాంటి లోన్లు, అప్పులు లేకుండా ఉన్న ఆస్తి ఏదైనా ఉందంటే శంకర్ పల్లి వద్ద ఉన్న 8 ఎకరాల పొలమేనని తెలిపారు. పవన్‌కు వ్యవసాయం చేయడమంటే ఎంతో ఇష్టమని అందుకోసమే.. చాలా ఏళ్ల క్రితం 8 ఎకరాలను కొనుగోలు చేశారని వివరించారు. పవన్ కొన్నప్పుడు ఆ భూమి 10 లక్షలు ఖరీదని చెప్పారు. పవన్ గతంలో తాను సంపాదించిన డబ్బును సేవా కార్యక్రమాల కోసం వెచ్చించేవాడని.. ప్రజంట్ పార్టీ కోసం ఖర్చు చేస్తున్నాడని నాగబాబు తెలిపారు. జానీ సినిమా ఫ్లాప్ అయినప్పుడు.. తన రెమ్యూనరేషన్‌తో పాటు మరికొంత ఆ సినిమా కొన్న డిస్ట్రిబ్యూటర్లకు ఇచ్చేశాడని చెప్పుకొచ్చారు. 8 ఎకరాల వ్యవసాయ క్షేత్రాన్ని కూడా ఇచ్చేయడానికి రెడీ అయితే తానే బలంవంతంగా ఆపానని నాగబాబు చెప్పారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.