Konidela NagaBabu: అప్పుడు నాకు జ్ఞానం లేదు.. ఇప్పుడు నువ్వు లేవు..తన తండ్రిని గుర్తుచేసుకుని ఎమోషనలైన మెగా బ్రదర్‌..

Konidela NagaBabu: ప్రముఖ సినీ న‌టుడు, మెగా బ్రదర్‌ నాగ‌బాబు (NagaBabu) తన తండ్రి పుట్టిన రోజు సందర్భంగా ఎమోషనల్‌ అయ్యారు. కొణిదెల వెంకట్రావ్ (Konidela Venkatrao) ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్ చేస్తూ భావోద్వేగభరితంగా నోట్ పెట్టారు..

Konidela NagaBabu: అప్పుడు నాకు జ్ఞానం లేదు.. ఇప్పుడు నువ్వు లేవు..తన తండ్రిని గుర్తుచేసుకుని ఎమోషనలైన మెగా బ్రదర్‌..
Naga Babu

Updated on: Jun 25, 2022 | 9:58 PM

Konidela NagaBabu: ప్రముఖ సినీ న‌టుడు, మెగా బ్రదర్‌ నాగ‌బాబు (NagaBabu) తన తండ్రి పుట్టిన రోజు సందర్భంగా ఎమోషనల్‌ అయ్యారు. కొణిదెల వెంకట్రావ్ (Konidela Venkatrao) ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్ చేస్తూ భావోద్వేగభరితంగా నోట్ పెట్టారు.. ‘నాన్నా నీకు జన్మదిన శుభాకాంక్షలు. నువ్వు బ్రతికి ఉన్నప్పుడు చెప్పాలన్న సెన్స్ గాని జ్ఞానం కానీ నాకు లేవు. అవి వచ్చాయనుకున్నప్పుడు నువ్వు లేవు’ అని రాసుకొచ్చాడు. అదేవిధంగా దయచేసి మీ తల్లిదండ్రులు, మీకు ప్రియమైన వారు జీవించి ఉన్నప్పుడే వారితో మీ ఎమోషన్స్ ను షేర్ చేసుకోండి’ అంటూ తన ఫ్యాన్స్‌కు సూచించారు. కాగా ఈ ట్వీట్‌ను చూసిన టాలీవుడ్ నిర్మాత బండ్ల గ‌ణేశ్ నిజం చెప్పారంటూ నాగబాబును ప్రశంసించారు.

కాగా గతంలో జబర్దస్త్, అదిరింది వంటి కామెడీషోలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించి బుల్లితెర ప్రేక్షకులను అలరించారు నాగబాబు. ప్రస్తుతం కొన్ని టీవీషోల్లోనూ సందడి చేస్తున్నారు. అదే సమయంలో తన తమ్ముడు పవన్‌ కల్యాణ్‌ జనసేన పార్టీ పీఏసీ స‌భ్యుడిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే ఆయన నిత్యం తన కుటుంబ సభ్యులతో గడిపిన క్షణాలను అందులో షేర్‌ చేసుకుంటుంటారు. ఇందులో భాగంగానే తన తండ్రి జయంతిని పురస్కరించుకుని ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..