Ravi Teja: మాస్ మహారాజ్ రవితేజ బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్ లో పెట్టి ఫుల్ బిజీగా గడిపేస్తున్నాడు. చాలా కాలాంతర్వత క్రాక్ సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి వచ్చిన రవితేజ ఇప్పుడు అదే జోష్ ను కంటిన్యూ చేస్తున్నాడు. ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు రవితేజ. ఖిలాడీ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవితేజ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడని టాక్. యాక్షన్ థ్రిల్లర్ గా ఈ మూవీ రూపొందుతుంది. ఈ సినిమాలో రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. ఈ సినిమాను ఫిబ్రవరి 11వ తేదీన విడుదల చేయనున్నారు. మరో వైపు రవితేజ రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమా చేస్తున్నాడు.
సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాకి శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్నాడు. విభిన్నమైన కథతో తెరకెక్కనున్న ఏ ఈసినిమాలో రవితేజ ప్రభుత్వ ఉద్యోగిగా కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు ఆకట్టుకున్నాయి. ఈ సినిమాను మార్చి 25వ తేదీన విడుదల చేయనున్నట్టుగా ఇటీవలే ప్రకటించారు మేకర్స్. అయితే ఇప్పుడు ఈ సినిమా అనుకున్న సమయానికి రావడం లేదని ప్రకటించారు. అనుకోని కారణాల వల్ల సినిమాను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు దర్శకుడు శరత్ మండవ ట్వీట్ చేశారు. కొత్త రిలీజ్ డేట్ ను త్వరలో ప్రకటిస్తామని శరత్ మండవ తెలిపారు. ఓమైక్రాన్ వ్యాప్తి కారణంగా సినిమా వాయిదా వేశారా లేక మరేదైనా కారణం ఉందా అన్నది తెలియాల్సి ఉంది.
మరిన్ని ఇక్కడ చదవండి :