AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ravi Teja : సంచలన నిర్ణయం తీసుకున్న మాస్ మహారాజ.. ఇకపై అలా కూడా

మాస్ మహారాజ రవితేజ  వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇటీవలే ఖిలాడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు మాస్ మాహా రాజా. ఆ మధ్య రవితేజ నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి.

Ravi Teja : సంచలన నిర్ణయం తీసుకున్న మాస్ మహారాజ.. ఇకపై అలా కూడా
Ravi Teja
Rajeev Rayala
|

Updated on: Apr 14, 2022 | 3:22 PM

Share

మాస్ మహారాజ రవితేజ(Ravi Teja) వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇటీవలే ఖిలాడి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు మాస్ మాహా రాజా. ఆ మధ్య రవితేజ నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ఆ సమయంలోనే గోపీచంద్ మలినేని తెరకెక్కించిన క్రాక్ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టి తిరిగి ఫామ్ లోకి వచ్చాడు రవితేజ. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. దాంతో మాస్ రాజా ఈస్ బ్యాక్ అంటూ అనౌన్స్ చేశారు రవితేజ. ఇదే జోష్ లో వరుస సినిమాలను కమిట్ అయ్యారు. ఈ క్రమంలోనే ఖిలాడి సినిమాను రిలీజ్ చేశారు. రమేష్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అనుకున్న రేంజ్ తో హిట్ అందుకోలేకపోయింది. ఈ సినిమా తర్వాత ఇప్పుడు రావణాసుర, రామారావు ఆన్ డ్యూటీ, ధమాకా, టైగర్ నాగేశ్వరావు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్స్ శరవేగంగా జరుగుతున్నాయి. వీటితోపాటు మరికొన్ని కథలను కూడా మాస్ రాజా ఓకే చేశారని తెలుస్తుంది.

ఇదిలా ఉంటే తాజాగా రవితేజ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇక పై హీరోగానే కాకుండా సపోర్టింగ్ రోల్స్ కూడా చేయాలనీ నిర్ణయించుకున్నారట ఈ ఖిలాడి. ఇతర హీరోల సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేయడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని ఇప్పటికే దర్శకులకు కూడా చెప్పేశారట. ఇదిలా ఉంటే రవితేజ మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ డైరెక్షన్ లో చేస్తున్న సినిమాలో రవితేజ కీలక పాత్రలో కనిపించనున్నాడని చాలా రోజులుగా టాక్ వినిపిస్తుంది. అలాగే బాలకృష్ణ -అనిల్ రావిపూడి దర్శకత్వంలో రాబోతున్న సినిమాలో రవితేజ కీలక పాత్రలో నటిస్తున్నారని టాక్ వినిపిస్తుంది. సపోర్టింగ్ రోల్స్ విషయంలో క్లారిటీ రావాలంటే రవితేజ స్పందించాల్సిందే..

మరిన్ని ఇక్కడ చదవండి : 

KGF chapter 2: యశ్‌ సినిమాపై సాయి ధరమ్‌ తేజ్‌ పోస్ట్‌ వైరల్‌.. ఇంతకీ ఏమన్నాడంటే..

Priyamani: మల్టీకలర్ శారీలో మత్తెక్కించే ఫోజులు ప్రియమణి లేటెస్ట్ పిక్స్

Anasuya Bharadwaj: నీలిరంగు చీరలోనా చందమామ నీవే జాణ.. అనసూయ భరద్వాజ్ లేటెస్ట్ ఫోటోస్