Ravi Teja Birthday: మాస్‌కి కేరాఫ్ అడ్రస్.. ఎనర్జీ లెవల్స్ పీక్స్.. ఈ రోజు రవితేజ బర్త్ డే..
ఇండస్ట్రీకి ఎంతోమంది హీరోలు వస్తుంటారు. 3, 4 ప్లాపులు పడగానే ఫేడ్ అవుట్ అవుతుంటారు. కానీ రవితేజ లోకల్. ఎన్ని ప్లాపుల పడ్డా ఆదే మాస్ ఫాలోయింగ్. ఆయన మూవీ రిలీజ్ అవుతుంది అంటే అంతే క్రేజ్.
Ravi Teja Birthday: ఇండస్ట్రీకి ఎంతోమంది హీరోలు వస్తుంటారు. 3, 4 ప్లాపులు పడగానే ఫేడ్ అవుట్ అవుతుంటారు. కానీ రవితేజ లోకల్. ఎన్ని ప్లాపుల పడ్డా ఆదే మాస్ ఫాలోయింగ్. ఆయన మూవీ రిలీజ్ అవుతుంది అంటే అంతే క్రేజ్. ఆయన పుట్టిందే సినిమా కోసం. పెరిగింది సినిమా కోసం. ఊహ వచ్చినప్పటి నుంచి సినిమానే జీవితంగా బ్రతికానని మాస్ మహరాజ్ పలు వేదికలపై వెల్లడించారు. సినిమా తప్ప తనకు ఇంకా ఏమి తెలియదని కూడా చెబుతుంటారు. క్లాప్ అసిస్టెంట్‌గా స్టార్టయి, డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తూ..చిన్న పాత్రలు వేసి..35 సంవత్సరాల వయసులో హీరో అయ్యాడు రవితేజ. ఆ తర్వాత తెలుగు చలన చిత్ర సీమలో ఆయనకు తిరుగులేకుండా పోయింది. వన్ బై వన్ హిట్స్ కొడుతూ మార్కెట్ పరిధిని విస్తరించుకున్నాడు. ఊర మాస్ చిత్రాలతో ఆడియెన్స్‌ను మెస్మరైజ్ చేసి ‘మాస్ మహారాజ్’ అనే ట్యాగ్ సొంతం చేసుకున్నాడు.
మెగాస్టార్ తర్వాత టాలీవుడ్‌తో స్వశక్తితో ఎదిగిన స్టార్ రవితేజ. ప్రశంసలు, విమర్శలు..హిట్టు, ప్లాపులు..వస్తాయ్, పోతాయ్. కానీ మాస్ మహారాజ్ సినిమా వస్తుందంటే ఆ కిక్ వేరు, ఆ బజ్ వేరు. మంగళవారం రవితేజ తన 53వ జన్మదినం జరుపుకుంటారు. ఆ విషయం చెబితే ఎవ్వరైనా నమ్ముతారా చెప్పండి. ఎందుకంటే ఆయన ఫేస్‌లో గానీ, పంచ్‌లో గానీ, బాడీ లాంగ్వేజ్‌లో గానీ అస్సలు ఆ ప్రభావం కనిపించదు. ఊహించని విధంగా ఏజ్ పెరుగుతోన్న కొద్దీ మార్కెట్‌తో పాటు, తన సినిమా స్థాయిని కూడా పెంచుకుంటున్నారు. ఇటీవల ‘క్రాక్’ సినిమాతో మాస్ జాతర ఎలా ఉంటుందో ప్రేక్షకులకు మరోసారి రుచి చూపించారు. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు ఇప్పుడు కలెక్షన్ల మోత మోగిస్తుంది. మరోవైపు రమేష్ వర్మ దర్శకత్వంలో ‘కిలాడీ’ మూవీ చేస్తున్నారు. ఏదీ ఏమైనా రవితేజ అంటే టాలీవుడ్‌లో సెపరేట్ మార్క్. అందరి హీరోల అభిమానులు.. ఆయన అభిమానులే. మరిన్ని మంచి, మంచి చిత్రాలతో మాస్ మహారాజ్ ప్రేక్షకులను అలరించాలని కోరుకుందాం.
Also Read: