Masooda Movie Review: థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌తో ఆకట్టుకునే మసూద!

| Edited By: Rajitha Chanti

Nov 18, 2022 | 1:20 PM

మళ్లీరాజా, ఏజెంట్‌ సాయిశ్రీనివాస్‌ ఆత్రేయ సినిమాలను తెరకెక్కించిన స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ మీద కూడా ఎప్పుడూ ఓ నజర్‌ ఉంటుంది. ఇప్పుడు ఆ బ్యానర్‌ నుంచి వచ్చిన మూవీ మసూద. ఈ సినిమా ఎలా ఉంది? జనాలకు నచ్చుతుందా? అసలు మసూద ఎవరు? ఆమె కథ ఏంటి?

Masooda Movie Review: థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌తో ఆకట్టుకునే మసూద!
Masooda
Follow us on

ఇండస్ట్రీలో కొన్ని బ్యానర్లకు స్పెషల్‌ క్రేజ్‌ ఉంటుంది. మళ్లీరాజా, ఏజెంట్‌ సాయిశ్రీనివాస్‌ ఆత్రేయ సినిమాలను తెరకెక్కించిన స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ మీద కూడా ఎప్పుడూ ఓ నజర్‌ ఉంటుంది. ఇప్పుడు ఆ బ్యానర్‌ నుంచి వచ్చిన మూవీ మసూద. ఈ సినిమా ఎలా ఉంది? జనాలకు నచ్చుతుందా? అసలు మసూద ఎవరు? ఆమె కథ ఏంటి? చదివేయండి…

సినిమా: మసూద

నిర్మాణ సంస్థ: స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మంఎట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌

ఇవి కూడా చదవండి

నటీనటులు: సంగీత, తిరువీర్‌, కావ్య కల్యాణ్‌రామ్‌, శుభలేఖ సుధాకర్‌, సత్యప్రకాష్‌, సత్యం రాజేష్‌ తదితరులు

నిర్మాత: రాహుల్‌ యాదవ్‌ నక్కా

దర్శకత్వం: సాయికిరణ్‌

కెమెరా: నగేష్‌

ఆర్ట్: క్రాంతి ప్రియమ్‌

ఎడిటర్‌: జెస్విన్‌ ఫ్రభు

సౌండ్‌ డిజైన్‌: సింక్‌ సినిమా

స్టంట్స్: రామ్‌ క్రిష్ణన్‌, స్టంట్‌ జాషువా

సంగీతం: ప్రశాంత్‌.ఆర్‌.విహారి

గోపి (తిరువీర్‌) ఓ ప్రైవేట్‌ ఆఫీస్‌లో పనిచేస్తుంటాడు. అతని కొలీగ్‌ మిని (కావ్య). ఆమెను ఇష్టపడుతుంటాడు. అయితే స్వతహాగా ఇంట్రోవర్ట్ కావడంతో ఆ విషయాన్ని బయటకు చెప్పడు. తీరా ఒకరికొకరు అర్థమవుతున్నారనుకునే సమయానికి గోపి అపార్ట్ మెంట్‌లో ఓ ఇష్యూ జరుగుతుంది. గోపీ ఉండే అదే అపార్ట్ మెంట్‌లో ఉంటుంది నీలమ్‌ (సంగీత). ఆమె కూతురు నజియా ఆర్టిస్ట్. ఉన్నట్టుండి పిచ్చిగా ప్రవర్తిస్తుంది నజియా. ఆ విషయం అర్థం కాని నీలమ్‌.. గోపీ సాయం కోరుతుంది. సాయం చేయడానికి వెళ్లిన గోపీకి మసూద గురించి తెలుస్తుంది. నజియాకీ మసూదకీ సంబంధం ఏంటి? నజియా చేతికున్న బ్రేస్‌లెట్‌ ఎవరిది? గోపీకీ, నీలమ్‌ కుటుంబానికి ఉన్న రిలేషన్‌ ఎలాంటిది? గోపీని మిని అర్థం చేసుకుందా? అపార్థం చేసుకుందా? ఇలాంటి చాలా విషయాలకు సమాధానం కావాలంటే సినిమా చూడాల్సిందే. ఎక్కడ చిన్న త్రెడ్‌ లీక్‌ అయినా సినిమా చూసే ప్రేక్షకులు థ్రిల్‌ మిస్‌ అయ్యే ప్రమాదం ఉంది.

స్కూలు టీచర్‌ కేరక్టర్‌లో, సింగిల్‌ మదర్‌గా, కాటన్‌ చీరలు కట్టుకుని చాలా బాగా యాక్ట్ చేశారు సంగీత. స్ట్రాంగ్‌ విమెన్‌గా ఆమె కేరక్టర్‌కి న్యాయం చేశారు. నజియా కేరక్టర్‌ చేసిన అమ్మాయి నేచురల్‌గా పెర్ఫార్మ్ చేసింది. గోపీలాంటి పాత్రలు మనకు నిజజీవితంలోనూ చాలా ఎదురుపడుతుంటాయి. కావాల్సినంత మాట్లాడటం, అవతలివారికి వీలైనంత సాయం చేయడం, తన పని తాను చేసుకుపోవడం.. ఇలాంటి కేరక్టరిస్టిక్స్ తో చాలా మంది రిలేట్‌ అవుతారు. మిని లాంటి అమ్మాయిలు మనకు తరచుగా కనిపిస్తూనే ఉంటారు. పనిచేసే చోట జీతాలు సరిగా ఇవ్వకపోతే, ఆ జీతాల మీద ఆధారపడ్డ కుటుంబాలు ఎదుర్కునే పరిస్థితులు… గౌరవంగా బతుకుతున్న సొసైటీని ప్రతిరోజూ ఫేస్‌ చేయలేక పడే పాట్లను కూడా సెన్సిటివ్‌గా చూపించారు.

మామూలుగా మసూద అని టైటిల్‌ పెట్టినప్పుడు, టైటిల్‌ పాత్రధారిని పాజిటివ్‌ కోణంలో చూపించే ప్రయత్నాలు ఎక్కువగా జరుగుతుంటాయి. కానీ సినిమాలో మసూదది నెగటివ్‌ కేరక్టర్‌. దాన్ని కూడా చాలా అందంగా మలచి, అందరికీ కన్విన్సింగ్‌గా చెప్పగలిగారు డైరక్టర్‌.

ఎక్కడా బోర్‌ కొట్టకుండా, జాగ్రత్తగా స్క్రీన్‌ప్లే రాసుకున్నారు. సింక్‌ సౌండ్‌ని స్పెషల్‌గా మెన్షన్‌ చేయాల్సిందే. నేపథ్య సంగీతం సినిమాకు అత్యంత పెద్ద ప్లస్‌ పాయింట్‌. కెమెరాపనితనం, ఆర్ట్ వర్క్ కూడా బావుంది. సినిమాను ఇంకాస్త క్రిస్పీగా ఎడిట్‌ చేసి ఉంటే బావుండేది. కథ ఆసక్తిగా సాగుతున్నా, స్క్రీన్‌ మీద సన్నివేశాలు మాత్రం స్లోగా సాగుతున్న ఫీలింగ్‌ కలుగుతుంది. సాటి మనిషికి సాయం చేయాలంటే వారితో ఏదో రిలేషన్‌ ఉండక్కర్లేదని చెప్పే మూవీ మసూద.
థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్ తో ఆకట్టుకుంటుంది మసూద.

– డా. చల్లా భాగ్యలక్ష్మి