Peddi Movie: రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాలో జాన్వీకపూర్‌కి డూప్.. ఈ తెలుగు హీరోయిన్ ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న లేటెస్ట్ సినిమా పెద్ది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తోన్న ఈ విలేజ్ స్పోర్ట్స్ డ్రామాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ మూవీలో జాన్వీ కి డూప్ గా ఓ తెలుగమ్మాయి నటిస్తోందట.

Peddi Movie: రామ్ చరణ్ పెద్ది సినిమాలో జాన్వీకపూర్‌కి డూప్.. ఈ తెలుగు హీరోయిన్ ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు
Janhvi Kapoor Peddi Movie

Updated on: Nov 25, 2025 | 9:20 PM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సనా కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమా పెద్ది. విలేజ్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బాలీవుడ్ అందాల తార జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, జగపతి బాబు, మీర్జాపూర్ వెబ్ సిరీస్ ఫేమ్ దివ్యేందు త్రిపాఠి, సత్య తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్, గ్లింప్స్ , సాంగ్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా చికిరీ సాంగ్ యూట్యూబ్ ను షేక్ చేసింది. వందల మిలియన్ల వ్యూస్ తో దూసుకెళ్లిపోతోంది. పెద్ది సినిమాలో జాన్వీ కపూర్ అచ్చియమ్మ అనే అమ్మాయి పాత్రలో కనిపించనుంది. సినిమాలో ఆమె పాత్ర చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని తెలుస్తోంది. ముఖ్యంగా చికిరీ సాంగ్ లో జాన్వీ చాలా అందంగా కనిపించింది. అయితే ఇదే సినిమాలో జాన్వీకి కొన్ని సీన్లలో డూప్ గా ఒక తెలుగమ్మాయి నటిస్తోందని సినిమా సర్కిళ్లలో ప్రచారం జరుగుతోంది. ఆ హీరోయిన్ మరెవరో కాదు మసూద సినిమాలో దెయ్యంగా భయ పెట్టిన భయపెట్టిన బాంధవి శ్రీధర్ అట,

జాన్వీ కపూర్ హైట్ సుమారు 5 అడుగుల 4 అంగుళాలట. బాంధవి శ్రీధర్ హైట్ కూడా దాదాపు అంతే ఉంటుందట. వీరిద్దిరి లుక్స్ కూడా చూడటానికి చాలా వరకు ఒకేలా ఉంటాయి. అందుకే ‘పెద్ది’ సినిమాలో కొన్ని సీన్లలో జాన్వీకి డూప్ గా బాంధవి నటించిందని సమాచారం. అంతేకాదు ఈ సినిమాలో బాంధవి శ్రీధర్ కూడా ఒక కీలక పాత్రలో కూడా నటిస్తుందని టాక్. మరి ఇందులో నిజమెంతుందో తెలియాలంటే వచ్చే ఏడాది మార్చి 27 వరకు ఆగాల్సిందే.

ఇవి కూడా చదవండి

కాగా ఈ అందాల తారకు సోషల్ మీడియాలో మస్త్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆమె ఫొటోలు, వీడియోలకు నెటిజన్ల నుంచి మంచి స్పందన కూడా వస్తుంటుంది. ఇటీవల పెద్ది సినిమాలోని చికిరి చికిరి సాంగ్ కు హుషారుగా స్టెప్పులేసింది బాంధవి శ్రీధర్. ఈ పాటను డిజైన్ చేసిన డ్యాన్స్ మాస్టర్ జానీ మాస్టర తో కలిసి స్టెప్పులేసింది. ఇందుకు సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది.

చికిరీ సాంగ్ కు జానీ మాస్టర్ తో కలిసి స్టెప్పులు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.