మన్సూర్ అలీ ఖాన్.. ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం ఇదే పేరు వినిపిస్తుంది. విలన్ గా పలు సినిమాల్లో మెప్పించిన మన్సూర్ అలీ ఖాన్ ఎప్పుడూ వివాదాలతో సావాసం చేస్తూ ఉంటాడు. నటుడిగా మంచి పేరు ఉన్న వ్యక్తిగతంగా మనోడి మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. తాజాగా ఈ విలన్ గారు చేసిన కామెంట్స్ పెద్ద దుమారాన్ని రేపాయి. నటి త్రిష పై మన్సూర్ అలీ చేసిన అసభ్యకరమైన కామెంట్స్ పై చాలా మంది మండిపడుతున్నారు. సినీ సెలబ్రెటీస్ కూడా మన్సూర్ అలీ ఖాన్ చేసిన కామెంట్స్ ను ఖండించారు. ఇటీవలే మన్సూర్ అలీ ఖాన్ దళపతి విజయ్ నటించిన లియో సినిమాలో నటించి మెప్పించాడు మన్సూర్ అలీ. అయితే ఇటీవలే ఓ ఇంట్రవ్యూలో మన్సూర్ అలీ మాట్లాడుతూ..
ఇప్పటికే చాలా రేప్ సీన్స్ లో నటించాను . లియో సినిమా లో దర్శకుడు త్రిషను రేప్ చేసే సీన్ ఉంటుందని అనుకున్నాను కానీ దర్శకుడు ఆ ఛాన్స్ ఇవ్వలేదు అని షాకింగ్ కామెంట్స్ చేశాడు. దాంతో పెద్ద ఎత్తున దుమారం రేగింది. త్రిష కూడా దీని స్పందిస్తూ.. అతనితో ఇకపై కలిసి పని చేయను అని తెగేసి చెప్పింది. అటు దర్శకుడు లోకేష్, అట్లీ , చిరంజీవి, నితిన్, రోజా ఇలా చాలా మంది మన్సూర్ అలీ పై మండిపడ్డారు.
అయితే మన్సూర్ అలీ మాత్రం త్రిషకు క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదు అని తేల్చి చెప్పాడు. సినిమాలో రేప్ సీన్స్ కు గురించి మాత్రమే తాను మాట్లాడానని అన్నాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు నడిగర్ సంఘం మన్సూర్ పై నిషేదం విధించింది. అలాగే తమిళ్ నాడులో కేసు కూడా ఫైల్ అయ్యింది. అయితే ఇప్పుడు మన్సూర్ అలీ ఖాన్ మాయమైనట్టు తెలుస్తోంది. ఈ విలన్ గారు ఇప్పుడు అజ్ఞాతంలోకి వెళ్ళాడట. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. అయితే అతని సన్నిహితులు చెప్తున్నాడని ప్రకారం మన్సూర్ అలీ త్ త్రిషకు క్షమాపణలు చెప్పాడు అని అంటున్నారు. ఈ క్రమంలో మన్సూర్ అలీ ఖాన్ ఓ స్టేట్ మెంట్ ఇచ్చాడని తెలుస్తోంది. నేను వారం పాటు కత్తి లేకుండా యుద్ధం చేశా.. రక్తం లేకుండా గెలిచా.. నా వ్యాఖ్యలు త్రిష మనసుకు భాద కలిగించి ఉంటే అందుకు క్షమించు. ఇంతటితో ఈ కళింగయుద్ధం ముగిసింది. నేను అహింస మార్గం వైపే నిలబడ్డాను.అని తెలిపాడు మన్సూర్ అలీ ఖాన్. ఇదిలా ఉంటే తమిళనాడు కోర్టు మన్సూర్ బెయిల్ కు నిరాకరించిందని తెలుస్తోంది.
#BREAKING : Actor #MansoorAliKhan
apologizes to Actress @trishtrashers” எனது சக திரைநாயகி திரிஷாவே
என்னை மன்னித்துவிடு!
இல்லறமாம் நல்லறத்தில் நின் மாங்கல்யம் தேங்காய் தட்டில் வலம்வரும்போது நான் ஆசிர்வதிக்கும் பாக்யத்தை இறைவன் தந்தருள்வானாக!! ஆமீன். ”—மன்சூர் அலிகான்
— Ramesh Bala (@rameshlaus) November 24, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.