సూపర్ స్టార్ కృష్ణ మృతితో మహేశ్ కుటుంబ సభ్యులు పుట్టెడు దుఃఖంలో మునిగిపోయారు అంతకుముందు కొన్ని రోజుల క్రితమే ఇందిరా దేవి కన్నుమూశారు.ఇక ఈ ఏడాది ప్రారంభంలో రమేశ్ బాబు కూడా ఈ లోకాన్ని విడిచివెళ్లిపోయాడు. ఇలా ఈ ఏడాది మహేశ్ బాబుకు అంతులేని విషాదాన్ని మిగిల్చింది. కృష్ణ- ఇందిరా దేవి దంపతులకు రమేష్ బాబు, మహేష్ బాబు, పద్మావతి, మంజుల, ప్రియదర్శిని అనే ఐదుగురు సంతానం ఉన్నారు. ఇదిలా ఉంటే మంగళవారం (నవంబర్22) సూపర్ స్టార్ కృష్ణ- ఇందిరా దేవిల పెళ్లిరోజు. ఈ సందర్భంగా మంజుల ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. కృష్ణ, ఇందిరా దంపతులకు సంబంధించిన అరుదైన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ వారికి వివాహ దినోత్సవ శుభాక్షాంక్షలు తెలిపింది.
‘అమ్మానాన్నల వివాహబంధం స్వర్గంలో కొనసాగేంతటి గొప్ప బంధం. అందుకే అమ్మ ఈలోకం నుంచి వెళ్లిపోయిన తర్వాత నాన్న ఆమెను చాలా మిస్ అయ్యారని నేను అనుకుంటున్నా. అందుకేనేమో మమ్మల్ని విడిచి వెంటనే అమ్మ వద్దకే చేరాడు. నిజంగా వారి ఆత్మలు కూడా సహచరులేనేమో. వారి 60 ఏళ్ల వివాహబంధానికి మేం ఐదుగురు పిల్లలం. ఇలాంటి ఉన్నతమైన వ్యక్తులు తల్లిదండ్రులు కావడం నిజంగా మేం చేసుకున్న అదృష్టం. ఎక్కడున్నా వారి ప్రేమాభిమానాలు మాపై ఉంటాయనుకుంటున్నా. వారిలో కనీసం 10 శాతమైన స్వచ్ఛంగా ఉండడమే మేం వారికిచ్చే ఉత్తమ బహుమతి అని నేను భావిస్తున్నా. హ్యాపి వెడ్డింగ్ యానివర్సరీ అమ్మా నాన్నా’ అని తెలిపింది మంజుల. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..