Manjula Ghattamaneni: ‘నాన్న లేకుండా నా మొదటి పుట్టిన రోజు’.. కృష్ణ కూతురు మంజుల ఘట్టమనేని ఎమోషనల్‌

సూపర్​స్టార్​ నటశేఖర కృష్ణ ఈ లోకాన్ని విడిచిపోయి సుమారు ఏడాది కావోస్తోంది. అనారోగ్య సమస్యలతో గతేడాది నవంబర్‌ 15న ఆయన కన్నుమూశారు. అంతకుముందే సెప్టెంబర్‌లో ఇందిరా దేవి, అలాగే జనవరిలో రమేశ్‌ బాబు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. మొత్తానికి 2022 సంవత్సరం హీరో మహేష్‌ బాబుకు తీరని విషాదాలను మిగిల్చింది. కాగా కృష్ణ మరణించే కొద్ది రోజులకు ముందే తన కూతురు మంజుల ఘట్టమనేని పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్నారు.

Manjula Ghattamaneni: నాన్న లేకుండా నా మొదటి పుట్టిన రోజు.. కృష్ణ కూతురు మంజుల ఘట్టమనేని ఎమోషనల్‌
Manjula Ghattamaneni

Updated on: Nov 08, 2023 | 5:26 PM

సూపర్​స్టార్​ నటశేఖర కృష్ణ ఈ లోకాన్ని విడిచిపోయి సుమారు ఏడాది కావోస్తోంది. అనారోగ్య సమస్యలతో గతేడాది నవంబర్‌ 15న ఆయన కన్నుమూశారు. అంతకుముందే సెప్టెంబర్‌లో ఇందిరా దేవి, అలాగే జనవరిలో రమేశ్‌ బాబు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. మొత్తానికి 2022 సంవత్సరం హీరో మహేష్‌ బాబుకు తీరని విషాదాలను మిగిల్చింది. కాగా కృష్ణ మరణించే కొద్ది రోజులకు ముందే తన కూతురు మంజుల ఘట్టమనేని పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్నారు. ఆయనతో పాటు హీరో మహేశ్‌, నమ్రత, మంజుల భర్త సంజయ్‌, కృష్ణ సోదరుడు ఆది శేషగిరిరావుతో సహా పలువురు కుటుంబ సభ్యులు మంజుల బర్త్‌ డే వేడుకలకు హాజరయ్యారు. కాగా బుధవారం (నవంబర్‌ 8) మంజుల పుట్టిన రోజు కావడంతో గతేడాది తన పుట్టిన రోజు వేడుకలకు సంబంధించిన ఫొటోలను సోషల్‌ మీడియా ఖాతాల్లో షేర్‌ చేసింది మంజుల. చివరిసారిగా నాన్న నాతో గడిపిన మధర క్షణాలంటూ ఎమోషనలైంది. ‘ప్రతి పుట్టిన రోజుకు మా నాన్న ఎప్పుడు నా పక్కనే ఉండేవారు. మొదటి సారిగా ఆయన లేకుండా నా బర్త్ డే జరుగుతోంది. ఈ ఫోటోల్లోని క్షణాలు నా జీవితంలో మధుర జ్ఞాపకాలు. నాన్నతో ఉన్న ఈ క్షణాలు నా జీవితాంతం గుర్తుంటాయి. ఈ ఫొటోలను నేను ఎప్పటికీ ప్రత్యేకంగా భద్రపరుచుకుంటాను’ అని భావోద్వేగానికి గురైంది మంజుల.

కాగా కృష్ణ తన కుటుంబ సభ్యులతో కలిసి చివరిసారిగా పాల్గొన్న వేడుక మంజుల పుట్టిన రోజే. ఈ ఫొటోల్లోనే ఆయన చివరి సారిగా కనిపించారు. ప్రస్తుతం మంజుల షేర్‌ చేసిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. అభిమానులు, నెటిజన్లు కృష్ణను గుర్తు చేసుకుంటున్నారు. అలాగే మంజులకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా కృష్ణ వారసురాలిగా మంజుల కూడా సినిమా ఇండస్ట్రీలో తన కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. నటిగా, నిర్మాతగా, డైరెక్టర్‌గా సత్తా చాటింది. ఇటీవలే స్వాతి, నవీన్‌ చంద్ర నటించిన మంత్‌ ఆఫ్‌ మధు సినిమాలో ఓ కీలక పాత్రలో మెరిసింది మంజుల.

ఇవి కూడా చదవండి

మంజుల పుట్టిన రోజు వేడుకల్లో సూపర్ స్టార్ కృష్ణ

మంజుల ఘట్టమ నేని ఇన్ స్టా గ్రామ్ ఫొటోస్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..