Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Manchu Vishnu: కన్నప్ప స్వగ్రామంలోని శివాలయానికి మంచు విష్ణు.. ప్రత్యేక పూజలు 

అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం ఊటుకూరు గ్రామంలోని భక్త కన్నప్ప టెంపుల్‌ని హీరో మంచు విష్ణు దర్శించారు. తాను నటించిన ‘భక్త కన్నప్ప’ మూవీ ఏప్రిల్‌ 25న రిలీజ్ అవ్వనున్న సందర్భంగా మూవీ టీమ్‌తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా ఆలయ అభివృద్ధికి సహకరిస్తానని ఈ సందర్భంగా మంచు విష్ణు తెలిపారు.

Manchu Vishnu: కన్నప్ప స్వగ్రామంలోని శివాలయానికి మంచు విష్ణు.. ప్రత్యేక పూజలు 
Manchu Vishnu At Temple
Follow us
Ram Naramaneni

|

Updated on: Mar 15, 2025 | 6:24 PM

డైనమిక్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప చిత్రాన్ని ఏప్రిల్ 25న విడుదల చేయబోతున్నారు. మోహన్ బాబు నిర్మించిన ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటి వరకు రిలీజ్ చేసిన రెండు టీజర్‌లు, పాటలు సినిమా మీద అంచనాల్ని పెంచేసాయి. కన్నప్ప రిలీజ్ అయ్యేలోపు ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించుకుంటానని విష్ణు మంచు చెప్పిన సంగతి తెలిసిందే.

తాజాగా విష్ణు మంచు భక్త కన్నప్ప సొంతూరికి వెళ్లారు. అన్నమయ్య జిల్లాలోని రాజంపేట మండలంలోని ఊటుకూరు గ్రామానికి వెళ్లారు. గ్రామస్థులు, ఆలయ సిబ్బంది విష్ణు మంచుకి, కన్నప్ప టీంకు ఘనంగా స్వాగతం పలికారు. అక్కడ కన్నప్ప స్వగృహాన్ని సందర్శించారు. అక్కడి శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివాలయాన్ని అభివృద్ది చేస్తానని కూడా విష్ణు మంచు హామీ ఇచ్చారు.

కన్నప్ప చిత్రంలో మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్, కాజల్ అగర్వాల్, ప్రీతి ముకుందన్ వంటి వారు నటించారు. ఈ చిత్రానికి స్టీఫెన్ దేవస్సీ అందించిన పాటలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పాటలు శ్రోతల్ని అలరించిన సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళీ, హిందీ భాషల్లో కన్నప్ప చిత్రాన్ని ఏప్రిల్ 25న భారీ ఎత్తున విడుదల చేయనున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..