- Telugu News Photo Gallery Cinema photos Actress pujita ponnada latest black and white photos goes viral
Pujita Ponnada: బ్లాక్ అండ్ వైట్ ఫొటోల్లో మైండ్ బ్లాక్ చేస్తున్న రంగస్థలం బ్యూటీ
పూజితకు బాగా గుర్తింపు తీసుకొచ్చిన సినిమా ఏదంటే రంగస్థలం అని చెప్పుకోవచ్చు. ఇందులో ఆది పినిశెట్టి ప్రియురాలు పద్మ పాత్రలో ఆమె అభినయం అందరినీ ఆకట్టుకుంది. సినిమాలో కనిపించింది కొంత సేపే అయినా తన నటనతో ఆకట్టుకుంది. ఆ తర్వాత రాజుగాడు, బ్రాండ్ బాబు, హ్యాపీ వెడ్డింగ్, కల్కి, వేర్ ఈజ్ వెంకట లక్ష్మి, రన్, మిస్ ఇండియా, కథ కంచికి మనం ఇంటికి, ఓదెల రైల్వే స్టేషన్ తదితర సినిమాల్లో నటించింది పూజిత.
Updated on: Mar 15, 2025 | 5:12 PM

2016లో నాగార్జున ఊపిరి సినిమాతో కెరీర్ ప్రారంభించింది పూజిత పొన్నాడ. ఆ తర్వాత నాగార్జున ప్రేమమ్ సినిమాలో కాలేజ్ స్టూడెంట్ గా కనిపించింది. ఈ రెండు సినిమాల్లో తన క్యూట్ నెస్ తో ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ.

అయితే పూజితకు బాగా గుర్తింపు తీసుకొచ్చిన సినిమా ఏదంటే రంగస్థలం అని చెప్పుకోవచ్చు. ఇందులో ఆది పినిశెట్టి ప్రియురాలు పద్మ పాత్రలో ఆమె అభినయం అందరినీ ఆకట్టుకుంది. సినిమాలో కనిపించింది కొంత సేపే అయినా తన నటనతో ఆకట్టుకుంది.

రంగస్థలం సినిమా తర్వాత వరుస అవకాశాలు అందుకుంది ఈ అమ్మడు. ఆ తర్వాత రాజుగాడు, బ్రాండ్ బాబు, హ్యాపీ వెడ్డింగ్, కల్కి, వేర్ ఈజ్ వెంకట లక్ష్మి, రన్, మిస్ ఇండియా, కథ కంచికి మనం ఇంటికి, ఓదెల రైల్వే స్టేషన్ తదితర సినిమాల్లో నటించింది పూజిత.

అలాగే రవితేజ రావణాసుర సినిమాల్లో మరో కీలక పాత్ర పోషించింది. అయితే ఎందుకోకానీ ఈ ముద్దుగుమ్మ క్రేజ్ మాత్రం రావడం లేదు. వరుసగా సినిమాలు చేస్తునా.. అందం అభినయం రెండూ ఉన్న కూడా ఈ అమ్మడికి అంతగా గుర్తింపు రావడంలేదు.

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తోన్న హరిహర వీరమల్లు సినిమాలో పూజిత కూడా కనిపించనుందని తెలుస్తోంది. అలాగే ఓ తమిళ సినిమాలోనూ నటిస్తోందీ అందాల తార. తాజాగా సోషల్ మీడియాలో బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు షేర్ చేసింది ఈ చిన్నది.





























