
టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప. ఈ మూవీపై ఇప్పటికే భారీ హైప్ నెలకొన్న సంగతి తెలిసిందే.. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మోహన్ బాబు భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఇందులో సౌత్ టూ నార్త్ స్టార్ నటీనటులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా గురించి ఎప్పుడూ ఏదోక అప్డేట్ బయటకు వస్తుంది. ఇక ఇటీవలే ఈ మూవీ సెట్లో అడుగుపెట్టడంతో మరిన్ని అంచనాలు పెరిగాయి. ఇందులో ప్రభాస్ శివుడి పాత్రలో కనిపించనున్నాడని ముందు నుంచి టాక్ వినిపిస్తుంది. కానీ ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ మాత్రం రాలేదు. తాజాగా కన్నప్ప సినిమాలో ప్రభాస్ పాత్రపై ఆసక్తికర విషయాలను బయటపెట్టాడు హీరో మంచు విష్ణు. ఈ మేరకు తన ఇన్ స్టాలో ఓ వీడియో రిలీజ్ చేస్తూ ప్రభాస్ డై హార్డ్ ఫ్యాన్స్ కోసమే అంటూ చెప్పుకొచ్చాడు.
“కన్నప్ప నుంచి అప్డేట్స్ ఎప్పుడు వచ్చినా అందరూ ఆత్రుతగా చూస్తుంటారు. గత ఐదారు అప్డేట్స్ ఇచ్చినప్పుడు కన్నప్ప టాప్ లో ట్రెండ్ అయ్యింది. నా మిత్రుడు ప్రభాస్ షూటింగ్ లో జాయిన్ అయ్యాడని చెప్పిన వార్త దేశవ్యాప్తంగా ట్రెండ్ అయ్యింది. దాదాపు 18 గంటలపాటు నెట్టింట ఈ న్యూస్ ట్రెండ్ అయ్యింది. కన్నప్పలో మహామహులు నటిస్తున్నారు. ఈ కథలో చాలా గొప్ప పాత్రలు ఉన్నాయి.
వాటిని అద్భుతమైన ఆర్టిస్టులు పోషిస్తున్నారు. ప్రభాస్ డైహార్ట్ ఫ్యాన్స్ కోసం ఓ విషయం చెబుతున్నాను. కన్నప్ప సినిమాను నేను చేస్తున్నా.. నువ్వు ఒక క్యారెక్టర్ చేయాలని ప్రభాస్ కు చెప్పాను. కథ బాగా నచ్చింది నాకు ఈ పాత్ర ఇంకా బాగా నచ్చింది. ఇది నేను చేయోచ్చా ? అని అడిగారు. ఏ క్యారెక్టర్ అయితే ప్రభాస్ కు నచ్చిందో అదే పాత్రను ఇప్పుడు పోషిస్తున్నాడు. ఒక్కో పాత్రను మీ ముందుకు తీసుకువస్తాను. బయటవచ్చే వార్తలను నమ్మకండి. అన్ని పాత్ర గురించి త్వరలోనే ప్రకటిస్తాం. సోమవారం మీకు అద్భుతమైన అప్డేట్ ఇవ్వబోతున్నాం” అని అన్నారు. ప్రస్తుతం విష్ణు చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.