Shiva Shankar Master: మాస్టార్ త్వరగా కోలుకోవాలి.. శివ శంకర్‌ మాస్టర్‌ ఆరోగ్యంపై స్పందించిన మంచు విష్ణు..

ప్రముఖ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ అనారోగ్య కారణాలతో ప్రస్తుతం హాస్పిటల్ పాలైన సంగతి తెలిసిందే.. కరోనా బారిన పడిన ఆయన గచ్చిబౌలిలోని ఏ ఐ జి హాస్పిటల్ లో క్రిటికల్ కేర్ లో వెంటిలేటర్ మీద చికిత్స పొందుతున్నారు..

Shiva Shankar Master: మాస్టార్ త్వరగా కోలుకోవాలి.. శివ శంకర్‌ మాస్టర్‌ ఆరోగ్యంపై స్పందించిన మంచు విష్ణు..
Manchu Vishnu

Updated on: Nov 27, 2021 | 7:53 AM

Shiva Shankar Master: ప్రముఖ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ అనారోగ్య కారణాలతో ప్రస్తుతం హాస్పిటల్ పాలైన సంగతి తెలిసిందే.. కరోనా బారిన పడిన ఆయన గచ్చిబౌలిలోని ఏ ఐ జి హాస్పిటల్ లో క్రిటికల్ కేర్ లో వెంటిలేటర్ మీద చికిత్స పొందుతున్నారు.. దురదృష్టవశాత్తు ఆయన భార్యకి కూడా కరోనా సోకడంతో ఆమె ఇంట్లోనే హోమ్ కవారెంటైన్ లో ఉంటున్నారు. శివ శంకర్ మాస్టర్ పెద్ద కుమారుడికి కూడా కరోనా సోకడంతో ఆయన కూడా వెంటిలేటర్ మీద చికిత్స పొందుతున్నారు. ఈ కుటుంబానికి చికిత్స కోసం రోజుకు లక్ష రూపాయలు ఖర్చు అవుతుండడంతో శివ శంకర్ మాస్టర్ చిన్న కుమారుడు అజయ్ తనకు సహాయం అందించవలసిందిగా సినీ పెద్దలను కోరారు. దాంతో సినిమా తారలు స్పందిస్తున్నారు. ఇప్పటికే సోనూసూద్, ధనుష్, మెగాస్టార్ చిరంజీవి శివ శంకర్ మాస్టర్  కుటుంబానికి అండగా నిలిచారు.

తాజాగా మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు స్పందించారు. శివశంకర్ మాస్టార్ చిన్న కుమారునికి ఫోన్ చేసి భరోసానిచ్చారని సమాచారం. ఆయన కుటుంబానికి అండగా నిలుస్తానని విష్ణు అన్నారు. మాస్టార్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. శివశంకర్ మాస్టర్ ఆరోగ్యంపై ఏఐజీ వైద్యులతో మాట్లాడినట్లు ఆయన ట్విటర్‌ వేదికగా తెలిపారు. ఈ మేరకు విష్ణు ట్వీట్‌ చేస్తూ.. ‘శివ శంకర్‌ మాస్టర్‌ ఆరోగ్యంపై ఆరా తీశాను. ఆయనకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Sree Leela : నవ్వే నిండు చందమామ.. ఈ పుత్తడిబొమ్మ.. అందాల శ్రీలీల లేటెస్ట్ ఫొటోస్..

Ramya Krishna: తమిళ బిగ్‌బాస్‌ హోస్ట్‌గా శివగామి!.. కోలీవుడ్‌లో చక్కర్లు కొడుతున్న ఆసక్తికర వార్త..

Akhanda : రికార్డుల మోత మోగాల్సిందే.. డిసెంబర్‌ 2 కోసం ఎదురుచూస్తున్న నందమూరి ఫ్యాన్స్..