MAA Elections Vishnu: మునుపెన్నడూ లేని విధంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేన్ (మా) ఎన్నికలు రసవత్తరంగా మారతుతున్నాయి. మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్, జీవిత, హేమ ఇలా ఏకంగా నలుగురు పోటీకి దిగుతుండడంతో ఆసక్తికరంగా మారింది. ఇక ఒకరిపై మరొకరు వరుసగా ట్వీట్లు, కామెంట్లు చేస్తుండడంతో వాతావరణం వేడేక్కింది. సాధారణ ఎన్నికలను తలపిస్తోన్న మా ఎన్నికలపై ఇప్పుడు అందరి దృష్టి పడింది. ఎన్నికలకు ఇంకా రెండు నెలల సమయం ఉన్నా ఇప్పటి నుంచే సందడి వాతావరణం మొదలైంది. ఈ క్రమంలోనే తాజాగా హీరో మంచి విష్ణు పోస్ట్ చేసిన ఓ వీడియో వైరల్‌గా మారింది. తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలా మొదలైంది.? దాని చరిత్ర ఏంటో చెప్పిన విష్ణు.. సినీ నటులకు తన తండ్రి మోహన్ బాబు ఎలాంటి సహాయం చేశాడు లాంటి వివరాలను చెప్పుకొచ్చారు. ఏకంగా 7 నిమిషాలు నిడివి ఉన్న ఈ వీడియోలో విష్ణు సుదీర్ఘంగా మాట్లాడారు.
ఈ సందర్భంగా మంచు విష్ణు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్ సినీ పెద్దలు స్పందించి ‘మా’ అధ్యక్ష ఎన్నికలను ఏకగ్రీవం చేస్తే తాను పోటీ నుంచి తప్పుకుంటానని స్పష్టం చేశారు. ఒకవేళ ఏకగ్రీవం చేయకపోతే మాత్రం తాను పోటీలో కొనసాగుతానని చెప్పుకొచ్చారు. ఇక తన తండ్రి మోహన్ బాబు పదవిలో ఉన్నా… లేకపోయినా సినీ కుటుంబానికి ఎప్పుడూ అండగా నిలబడ్డారన్నారు. ఈరోజుకీ ఇండస్ట్రీలో ఎవరికి ఏ సమస్య వచ్చినా.. మంచు కుటుంబం అండగా ఉందని తెలిపారు. 2015లో దాసరి నారాయణ రావు, మురళీ మోహన్ ఇద్దరు కలిసి తనను మా అధ్యక్షుడిగా ఉండమని అన్నారని.. కానీ మోహన్ బాబు ఇంత చిన్న వయసులో పెద్ద పదవి ఎందుకు అని సర్దిచెప్పారని చెప్పుకొచ్చారు. ఇక ప్రతీసారి మా ఎన్నికల్లో ‘మా’ భవనం ప్రధాన అజెండాగా మారుతోందని చెప్పిన విష్ణు.. ‘మా’ అసోసియేషన్ భవనాన్ని నేను, మా కుటుంబ సభ్యులు కట్టిస్తాం” అని వెల్లడించారు. ‘మా’లో సభ్యత్వం లేనివారికీ అవకాశాలు వస్తున్నాయని ఆరోపించారు. ‘మా’లో సభ్యత్వం ఉన్నవారికే అవకాశాలు ఇవ్వాలని, తద్వారా ‘మా’ను గౌరవించాలని డిమాండ్ చేశారు. ప్రతి నటుడు ‘మా’ సభ్యత్వం తీసుకోవాలని, నిర్మాతలు, ఓటీటీలు కూడా ‘మా’ సభ్యులకే అవకాశాలు ఇవ్వాలని స్పష్టం చేశారు.
Also Read: Shruthi Haasan: భాయ్‌ఫ్రెండ్ శంతను హజరికా తో వంటిట్లో ఎంజాయ్ కమల్ డాటర్.. వీడియో వైరల్
క్లామాక్స్ కు చేరిన గని మూవీ షూటింగ్…మరో హిట్ కన్ఫామ్ అంటున్న అభిమానులు