AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Manchu Vishnu: తనయుడితో కలిసి మంచు విష్ణు హార్స్ రైడింగ్.. పెద్ద సాహసమే చేశాడుగా..

Manchu Vishnu: యాక్టర్‌ మోహన్‌ బాబు వారసుడిగా.. టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు మంచు విష్ణు.

Manchu Vishnu: తనయుడితో కలిసి మంచు విష్ణు హార్స్ రైడింగ్.. పెద్ద సాహసమే చేశాడుగా..
Manchu Vishnu
Rajitha Chanti
|

Updated on: Jul 28, 2021 | 9:48 PM

Share

Manchu Vishnu: యాక్టర్‌ మోహన్‌ బాబు వారసుడిగా.. టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు మంచు విష్ణు. ఢీ వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత మంచు విష్ణుకు సరైన హిట్ అందుకోలేకపోయాడు. దీంతో ఓ పక్క సినిమాల్లో నటిస్తూనే మరో పక్క సినిమాలను నిర్మిస్తూ… ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు. తండ్రి మోహన్‌ బాబులాగే ఇండస్ట్రీలో అందరితో.. కలిసిపోయే మంచు విష్ణు.. మా అధ్యక్ష ఎన్నికల్లో కూడా తన సత్తా చాటేందుకు రెడీ అయిపోయారు. ప్రస్తుతం మా అధ్యక్ష పదవికి పోటి చేస్తున్న విష్ణు.. నిత్యం మా ఎన్నికలపై తనదైన శైలీలో స్పందిస్తున్నారు. ఇటీవల మోసగాళ్లు అనే భారీ బడ్జెట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విష్ణుకు మరోసారి నిరాశే ఎదురైంది. ప్రస్తుతం విష్ణు మా ఎన్నికలలో పోటీ చేస్తూనే ఢీ సిక్వెల్ చేయడానికి సిద్ధమవుతున్నారు.

ఇదిలా ఉంటే.. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ మంచువారి పెద్దబ్బాయి. తన కొడుకుతో కలిసి తాజాగా హార్స్‌ రైడ్‌ చేశారు. హార్స్‌ రైడ్ చేయడమే కాదు… ఆ వీడియోను తన అభిమానులతో పంచుకున్నారు కూడా…! కొడుకు అవ్‌రమ్‌ (avram) అంటే విపరీతంగా లైక్‌ చేసే మంచు విష్ణు తీరిక దొరికినప్పుడల్లా… తన చిన్నారితో టైం స్పెండ్‌ చేస్తుంటారు. అవ్‌రమ్‌ను ఆడిస్తూ… ఫోటోషూట్‌ చేయిస్తూ… ఆ ఫోటోలు, వీడియోలను అభిమానులతో పంచు కుంటూ ఉంటారు.

వీడియో..

Also Read: Singer Chitra: పాటలే కాదు.. డైలాగ్స్ చెప్పడంలోనూ అదుర్స్.. సింగర్ చిత్ర నోట బాలయ్య పవర్ ఫుల్ డైలాగ్..

RS Praveen Kumar : జెండా ఎత్తుకుంటారా? కొత్త జెండాను ప్రకటిస్తారా? మాజీ ఐపీఎస్‌ RS ప్రవీణ్‌కుమార్‌ రూటెటు?

ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన ప్రదేశాలు..వాటి గురించి తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..

Good News: తక్కువ ధరకే కరోనా రక్షణ కవచాలు.. సరికొత్త ఫేస్ ఫీల్డ్‌ రూపొందించిన హైదరాబాద్ ఐఐటీ బృందం