మంచు హీరో విషు(Vishnu Manchu) కెరీర్ లో పెద్ద హిట్ గా నిలిచిన సినిమా ఏది నాటే టక్కున చెప్పే పేరు ఢీ. శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. జెనీలియా(Genelia)హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో విష్ణు తన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. శ్రీహరి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా తర్వాత మంచు విష్ణుకు ఆతరహా విజయం మళ్లీ లభించలేదు. అటు శ్రేణి వైట్ల కూడా మహేష్ తో చేసిన దూకుడు సినిమా తర్వాత ఆ రేంజ్ హిట్ ను అందుకోలేకపోయారు. ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి మరోసారి హిట్టు కొట్టడానికి రెడీ అవుతున్నారు. ఢీ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ కూడా చేశారు శ్రీను వైట్ల.
ఇదిలా ఉంటే ఢీ సినిమా రీసెంట్ గా 15 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా విష్ణు-జెనిలియా ఈ సినిమాలోని ఐకానిక్ ఓస్టిల్ ని రీక్రియేట్ చేసారు. జిమ్ లో ఇద్దరు కలిసిన సందర్భంలో కండలు చూపిస్తూ ఫోటోకి ఫోజ్ ఇచ్చారు. సినిమాలో ఆనాటి స్టిల్ ని..ఈ కొత్త ఫోటో జోడించి సోషల్ మీడియాలో షేర్ చేసారు. `నా టింకర్ బెల్, నేను` ఇప్పటికీ ఏమీ మారలేదు..అని విష్ణు రాసుకొచ్చారు. ఇప్పుడు ఏ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక జానీలియా పెళ్లితర్వాత సినిమాకు దూరంగా ఉంటున్నారు. ఇటీవలే తెలుగులో ఈ అమ్మడు రీ ఎంట్రీ ఇవ్వనుందని ఓ వార్త ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది
My Tinker bell and me. Nothing has changed since we met @geneliad ❤️
Powerful Bond, forever ? pic.twitter.com/62gTYC4JlG
— Vishnu Manchu (@iVishnuManchu) May 22, 2022
మరిన్ని ఇక్కడ చదవండి :