AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Manchu Manoj: ‘నా ఇన్‌స్పిరేషన్ నువ్వే’.. భార్య మౌనికకు బర్త్ డే విషెస్ చెప్పిన మంచు మనోజ్.. పోస్ట్ వైరల్

టాలీవుడ్ హీరో మంచు మనోజ్ గతేడాది వివాహాబంధంలోకి అడుగుపెట్టాడు. ఆళ్లగడ్డకు చెందిన భూమా మౌనికను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇక ఈ ఏడాది తండ్రిగా ప్రమోషన్ కూడా కొట్టేశాడు. తమ వైవాహిక బంధానికి ప్రతీకగా మంచు మనోజ్- మౌనిక దంపతులకు పండంటి కూతురు జన్మించింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈ జంట తమ మొదటి బిడ్డకు స్వాగతం పలికారు. ఆ తర్వాత తమ గారాల పట్టికి ఘనంగా బారసాల నిర్వహించారు.

Manchu Manoj: 'నా ఇన్‌స్పిరేషన్ నువ్వే'.. భార్య మౌనికకు బర్త్ డే విషెస్ చెప్పిన మంచు మనోజ్.. పోస్ట్ వైరల్
Manchu Manoj Family
Basha Shek
|

Updated on: Oct 05, 2024 | 1:29 PM

Share

టాలీవుడ్ హీరో మంచు మనోజ్ గతేడాది వివాహాబంధంలోకి అడుగుపెట్టాడు. ఆళ్లగడ్డకు చెందిన భూమా మౌనికను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇక ఈ ఏడాది తండ్రిగా ప్రమోషన్ కూడా కొట్టేశాడు. తమ వైవాహిక బంధానికి ప్రతీకగా మంచు మనోజ్- మౌనిక దంపతులకు పండంటి కూతురు జన్మించింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈ జంట తమ మొదటి బిడ్డకు స్వాగతం పలికారు. ఆ తర్వాత తమ గారాల పట్టికి ఘనంగా బారసాల నిర్వహించారు. దేవసేన శోభా ఎంఎం అని నామకరణం కూడా పెట్టేశారు. ఇక సినిమాల్లోనూ మళ్లీ బిజీ బిజీ అవుతున్నాడు మంచు మనోజ్. ఇలా పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్‌ లో మనోజ్ కు అన్ని శుభ శకునాలే జరుగుతున్నాయి. ముఖ్యంగా మౌనిక అడుగు పెట్టినప్పటి నుంచి మనోజ్ జీవితం బాగా మారిపోయింది. ఈ విషయాన్ని అతనే పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. ఇలా తన జీవితాన్ని రంగుల మయంగా మార్చిన మౌనిక పుట్టిన రోజు కావడంతో మంచు మనోజ్ స్పెషల్ గా విషెస్ తెలిపాడు. సామాజిక మాధ్యమాల వేదికగా తన భాగస్వామికి బర్త్‌ డే శుభాకాంక్షలు చెబుతూ ఎమోషనల్ పోస్ట్ చేశాడు. ‘నా లైఫ్‌లోని సూపర్ వుమెన్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. నాకు స్ఫూర్తిగా నిలిచినందుకు ధన్యవాదాలు. పిల్లల కోసం నువ్వు రూపొందించిన ఎడ్యుకేషన్‌ గేమింగ్ యాప్‌ లాంఛ్‌ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’ అని మంచు మనోజ్ రాసుకొచ్చాడు.

ప్రస్తుతం మంచు మనోజ్ షేర్ చేసిన పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు మౌనికకు బర్త్‌ డే విషెస్ చెబుతున్నారు. ఇక మంచు మనోజ్ సోదరి మంచు లక్ష్మి కూడా మౌనికకు బర్త్ డే విషెస్ తెలిపింది. ‘ హ్యపీ బర్త్‌ డే మౌనిక.. మా జీవితాల్లో చాలా సంతోషాన్ని తీసుకొచ్చావ్’ అంటూ ఇన్ స్టా స్టోరీస్ లో ఒక పోస్ట్ పెట్టింది మంచు వారమ్మాయి. ఈ సందర్భంగా వివిధ సందర్భాల్లో మౌనికతో దిగిన కొన్ని అరుదైన ఫొటోలను అందులో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు కూడా నెట్టింట వైరలవుతున్నాయి. కాగా మనోజ్- మౌనికల వివాహా వేడుక హైదరాబాద్ లోని మంచు లక్ష్మి ఇంట్లోనే అంగరంగ వైభవంగా జరిగింది. తన సోదరుడి వివాహానికి సంబంధించి అన్నీ తానై ముందుండి చూసుకుంది మంచు లక్ష్మి.

ఇవి కూడా చదవండి

భార్యతో మంచు మనోజ్..

View this post on Instagram

A post shared by Manoj Manchu (@manojkmanchu)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
రైతులను రిచ్ చేసే పంట.. పూర్తి వివరాలు మీ కోసం..
రైతులను రిచ్ చేసే పంట.. పూర్తి వివరాలు మీ కోసం..
ఆలయంలో ఎదురుపడ్డ నాగుపాము,పిల్లి.. ఆ తర్వాత జరిగిందిదే..
ఆలయంలో ఎదురుపడ్డ నాగుపాము,పిల్లి.. ఆ తర్వాత జరిగిందిదే..
గర్భవతినని బాస్‌కి మెసేజ్ చేసిన మహిళ.. 3 గంటల్లోనే ఉద్యోగం ఊస్ట్‌
గర్భవతినని బాస్‌కి మెసేజ్ చేసిన మహిళ.. 3 గంటల్లోనే ఉద్యోగం ఊస్ట్‌
తెలంగాణ విద్యార్థులకు అలెర్ట్.. జూలై 24న విద్యాసంస్థల బంద్‌..!
తెలంగాణ విద్యార్థులకు అలెర్ట్.. జూలై 24న విద్యాసంస్థల బంద్‌..!
మీపేరు మీద వేరేవాళ్ళు SIM వాడుతున్నారా? గుర్తించడం ఎలా?
మీపేరు మీద వేరేవాళ్ళు SIM వాడుతున్నారా? గుర్తించడం ఎలా?
మేక పిల్లల కోసం దారుణం.. మాజీ సర్పంచ్ దాడిలో పశువుల కాపరి బలి!
మేక పిల్లల కోసం దారుణం.. మాజీ సర్పంచ్ దాడిలో పశువుల కాపరి బలి!
చూసేందుకు కంటిలో నలుసంత.. కానీ దగ్గు, ఆస్తమాకు చెక్ పెట్టేస్తుంది
చూసేందుకు కంటిలో నలుసంత.. కానీ దగ్గు, ఆస్తమాకు చెక్ పెట్టేస్తుంది
గురు పూర్ణిమ నుంచి మహర్దశ.. ఇక ఈ రాశుల వారికి తిరుగుండదు!
గురు పూర్ణిమ నుంచి మహర్దశ.. ఇక ఈ రాశుల వారికి తిరుగుండదు!
పేపర్ లీక్‌లపై కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్..!
పేపర్ లీక్‌లపై కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్..!
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత