Manchu manoj: రామ్ చరణ్, ఉపాసన దంపతులపై మనోజ్ ఆసక్తికర ట్వీట్.. త్వరలోనే కలుద్ధామంటూ..

|

Apr 09, 2023 | 3:34 PM

పెళ్లి తర్వాత మనోజ్ తన కెరీర్ పై ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం ఆయన తన తదుపరి సినిమాల షూటింగ్స్ అంటూ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన కొణిదెల పై అసక్తికర ట్వీట్ చేశారు.

Manchu manoj: రామ్ చరణ్, ఉపాసన దంపతులపై మనోజ్ ఆసక్తికర ట్వీట్.. త్వరలోనే కలుద్ధామంటూ..
Manchu Manoj, Ram Charan
Follow us on

మంచు వారబ్బాయి మనోజ్ ఇటీవలే దాపంత్యజీవితంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. మార్చి 3న తన స్నేహితురాలు భూమా మౌనికతో ఏడడుగులు వేసి కొత్త జీవితం ప్రారంభించాడు మంచు మనోజ్. మౌనికతోపాటు.. ఆమె కొడుకు ధైరవ్ రెడ్డి బాధ్యత కూడా తనదేనని తెలియజేస్తూ.. శివాజ్ఞ అంటూ ట్వీట్ చేశారు. ఇక మనోజ్ పెళ్లి బాధ్యతలను సోదరి మంచు లక్ష్మి అన్ని తానై చూసుకున్నారు. మనోజ్, మౌనిక వివాహం మంచు లక్ష్మి ఇంట్లో ఘనంగా జరిగింది. వీరి పెళ్లికి ఇరువురు కుటుంబసభ్యులతోపాటు.. సినీ ప్రముఖులు కూడా హజరై నూతన దంపతులను ఆశీర్వాదించారు. పెళ్లి తర్వాత మనోజ్ తన కెరీర్ పై ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం ఆయన తన తదుపరి సినిమాల షూటింగ్స్ అంటూ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన కొణిదెల పై అసక్తికర ట్వీట్ చేశారు.

చరణ్, ఉపాసన తమకు ఓ గిఫ్ట్ పంపి సర్పైజ్ చేశారని తెలిపారు మనోజ్. పాలరాతితో చేసిన జంట స్వేచ్చగా విహరిస్తున్నట్లుగా ఉన్న ఓ బహుమతిని పంపి ఆశీర్వాదం అందించారంటూ అందుకు సంబంధించిన ఫోటోలను ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు మనోజ్. సర్ ఫ్రైజ్ గిఫ్ట్ అనేవి ఇలా అద్భుతంగా ఉంటాయి. థాంక్యూ చరణ్ ఉపాసన. మిమ్మల్ని ఎప్పుడెప్పుడూ కలుద్ధామా అని ఎదురుచూస్తున్నాను. మీ మాల్దీవులు ట్రిప్ ముగియగానే కలుద్దాం.. ప్రేమతో M & M అంటూ రాసుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే.. ఇటీవల దుబాయ్ వెకేషన్ వెళ్లారు చరణ్, ఉపాసన. ఈ ట్రిప్ ముగియగానే.. ఏప్రిల్ 8న మాల్దీవులకు వెళ్లారు. ప్రస్తుతం తన సినిమాకు కొద్దిపాటు గ్యాప్ రావడంతో చరణ్ దంపతులు వెకేషన్ వెళ్లినట్లుగా తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.