Manchu Manoj: మా నాన్న, అన్న తరఫున నేను క్షమాపణలు కోరుతున్నా.. మీడియా ముందు మనోజ్ కన్నీళ్లు

|

Dec 11, 2024 | 11:27 AM

మా నాన్న నాకు దేవుడు.. కానీ ఈరోజు కనిపిస్తున్న మా నాన్న మా నాన్న కాదు. నాపై అసత్య ప్రచారం చేస్తున్నారు. నేను ఎప్పుడూ ఎవరిని ఆస్తులు అడగలేదు. నా వ్యక్తిగత జీవితం గురించి మా నాన్నగారికి అపార్థంగా చెప్పారు. ప్రేమించి పెళ్లి చేసుకోవడంతోనే నా తండ్రితో నాకు విభేదాలు సృష్టించారు అని అన్నారు మంచు మనోజ్

Manchu Manoj: మా నాన్న, అన్న తరఫున నేను క్షమాపణలు కోరుతున్నా.. మీడియా ముందు మనోజ్ కన్నీళ్లు
Manchu Manoj
Follow us on

నాకోసం వచ్చిన మీడియాపై మా నాన్న దాడి చేసినందుకు క్షమించండి అని అన్నారు మంచు మనోజ్. బుధవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. తన భార్య ఏడు నెలల గర్భవతిగా ఉన్న సమయంలో ఎన్నో బాధలు అనుభవించిందని.. ఇప్పుడు కనిపిస్తున్న తన తండ్రి అలా ఉండేవాడు కాదని అన్నారు. “మా నాన్న నాకు దేవుడు.. కానీ ఈరోజు కనిపిస్తున్న మా నాన్న మా నాన్న కాదు. నాపై అసత్య ప్రచారం చేస్తున్నారు. నేను ఎప్పుడూ ఎవరిని ఆస్తులు అడగలేదు. నా వ్యక్తిగత జీవితం గురించి మా నాన్నగారికి అపార్థంగా చెప్పారు. ప్రేమించి పెళ్లి చేసుకోవడంతోనే నా తండ్రితో నాకు విభేదాలు సృష్టించారు. ఈ విషయంలో నా భార్య, ఏడు నెలల కూతురి పేరును లాగుతున్నారు. నేను సొంత కాళ్ల మీద నిలబడటానికి ప్రయత్నిస్తున్నాను. మీడియాపై దాడి చేయడం బాధ కలిగించింది. అందుకు క్షమాపణ చెబుతున్నాను. ఈరోజు సాయంత్రం 5 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి అన్ని నిజాలను బయటపెడతాను” అంటూ తీవ్ర భావోద్వానికి గురయ్యారు మంచు మనోజ్.

ఇదిలా ఉంటే నిన్న రాత్రి హైదరాబాద్ జల్ పల్లిలోని ఇంటి వద్ద టీవీ9 మీడియా ప్రతినిధి రంజిత్ పై మోహన్ బాబు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై జర్నలిస్ట్ సంఘాలు మోహన్ బాబు ఇంటి వద్ద ధర్నా చేశారు. ఇందుకు మంచు మనోజ్ సైతం సంఘీభావం ప్రకటించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తన కుటుంబంలో జరుగుతున్న పరిణామాలను చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇలాంటి రోజు వస్తుందని తాను కలలో కూడా ఊహించలేదంటూ ఎమోషనల్ అయ్యారు.

ఇది చదవండి : Tollywood: ఒక్క సినిమాకు రూ.40 కోట్లు రెమ్యునరేషన్.. ప్రైవేట్ జెట్, ఇండియా, అమెరికాలో కోట్ల ఆస్తులు ఉన్న ఏకైక హీరోయిన్..

Vijay Sethupathi: విజయ్ సేతుపతి ఇన్ స్టాలో ఫాలో అవుతున్న ఏకైక హీరోయిన్.. ఎవరో తెలుసా..?

Tollywood : గ్యాంగ్‌స్టర్‌తో ప్రేమలో పడి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్.. ఇండస్ట్రీకి దూరం..

Actress Gajala: వాసి వాడి తస్సాదియ్యా.. అందాలతో హార్ట్ ఎటాక్ తెప్పిస్తోన్న ఎన్టీఆర్ హీరోయిన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.