Manchu Manoj: జల్లికట్టు వేడుకల్లో మంచు మనోజ్‌.. TDP, జనసేన నేతల ఘన స్వాగతం..!

తిరుపతిలోని చంద్రగిరి నియోజకవర్గంలో జరిగిన జల్లికట్టు వేడుకలకు మంచు మనోజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఆయన్ని చూడ్డానికి చాలా మంది అభిమానులు హాజరయ్యారు. అంతేకాదు ముఖ్య అతిథిగా వచ్చిన మంచు మనోజ్‌కు టిడిపి, జనసేన, ఎన్టీఆర్ అభిమానులు గ్రాండ్ వెల్‌కమ్ పలికారు.

Manchu Manoj: జల్లికట్టు వేడుకల్లో మంచు మనోజ్‌.. TDP, జనసేన నేతల ఘన స్వాగతం..!
Manchu Manoj

Edited By: Janardhan Veluru

Updated on: Feb 17, 2025 | 7:53 PM

సినిమాలతో పాటు ఈ మధ్య పలు రాజకీయ వేదికలపై కూడా కనిపిస్తున్నాడు మంచు మనోజ్. ఈయన ఎక్కడికి వచ్చినా.. స్పెషల్ అట్రాక్షన్ అవుతున్నాడు. ఎప్పుడు ఏం మాట్లాడతాడో అంటూ మంచు వారబ్బాయి బాగా ట్రెండ్ అవుతున్నాడు కూడా. తాజాగా ఈయన మరో వేడుకకు వచ్చాడు. తిరుపతిలోని చంద్రగిరి నియోజకవర్గంలో జరిగిన జల్లికట్టు వేడుకలకు మంచు మనోజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఆయన్ని చూడ్డానికి చాలా మంది అభిమానులు హాజరయ్యారు. అంతేకాదు ముఖ్య అతిథిగా వచ్చిన మంచు మనోజ్‌కు టిడిపి, జనసేన, ఎన్టీఆర్ అభిమానులు గ్రాండ్ వెల్‌కమ్ పలికారు. టిడిపి, జనసేన, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో డప్పులతో, బాణసంచాలతో అంగరంగ వైభవంగా మొదలైన ఈ జల్లికట్టు వేడుకలలో పశువులను అందంగా అలంకరిస్తూ ఊరంతా ఊరేగింపుగా జరుపుకుంటారు. ఈ వేడుకలకు హీరో మంచు మనోజ్ ముఖ్య అతిథిగా హాజరవడంతో.. యూత్ అంతా ఎంతో ఉత్సాహంగా ఈ వేడుకల్లో పాల్గొని సెలబ్రేట్ చేశారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరవడంపై నటుడు మంచు మనోజ్ సంతోషం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘బ్రిటీష్ కాలం నుండి ‘జల్లికట్టు’ పండుగ జరుగుతూనే ఉంది. సంస్కృతి, సాంప్రదాయాలకు గుర్తుగా చేసుకునే ఈ జల్లికట్టు వేడుకలను గత 20 సంవత్సరాలుగా ఈ చంద్రగిరి నియోజకవర్గంలో నిర్వహించడం చాలా గొప్ప విషయం. తమిళనాడు ‘జల్లికట్టు’తో పోల్చుకుంటే ఇక్కడ అంత సివియర్‌గా ఉండదు. ఇక్కడ అంతా సాప్ట్‌గా ఉంటుంది. పశువుల పండగ‌గా చాలా భక్తితో జరుపుకుంటాం. పశువులపై హింసాత్మకంగా ప్రవర్తించకుండా, ముందుగా ఆలోచించుకుని ఇక్కడ ఈ వేడుకను జరుపుతుంటారు. దీనిని ప్రజలంతా ఎంతో ఆనందకరంగా పార్టీలకు, కులాలకు అతీతంగా జరుపుకుంటారు. పోలీస్ వారు లా అండ్ అర్డర్ విషయంలో చాలా కేరింగ్‌గా ఉన్నారు. దీనిలో పాల్గొనే ఉత్సాహవంతులైన యువకులంతా పోలీసు వారికి సహకరిస్తూ, శాంతి భద్రతలను కాపాడుతూ జల్లికట్టులో పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాను’’ అని తెలిపారు. తనకు ఇంతమంది వెల్ కమ్ ఇచ్చిన టిడిపి, జనసేన, ఎన్టీఆర్ అభిమానులకు మంచు మనోజ్ ధన్యవాదాలు తెలిపారు.