AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Manchu Manoj- Mounika: అమ్మానాన్నలుగా ప్రమోషన్‌.. అనాథ పిల్లల ఆకలి తీర్చిన మనోజ్, మౌనిక.. వీడియో చూశారా?

ప్రొఫెషనల్‌గా, పర్సనల్‌గా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సామాజిక సేవా కార్యక్రమాల కోసం కొంచెం సమయం కేటాయిస్తుంటాడు మనోజ్‌. గతంలో పలు సార్లు అనాథ పిల్లలు, విద్యార్థులకు తన వంతు సాయం చేసి తన మంచి మనసును చాటుకున్నాడు. ఇప్పుడు మరోసారి తన విశాల హృదయాన్ని చాటుకున్నాడు మంచు వారబ్బాయి. మౌనిక ప్రెగ్నెన్సీ గర్భం ధరించడంతో తాజాగా హైదరాబాద్‌లోని ఓ అనాథశ్రమానికి వెళ్లాడు మనోజ్‌

Manchu Manoj- Mounika: అమ్మానాన్నలుగా ప్రమోషన్‌.. అనాథ పిల్లల ఆకలి  తీర్చిన మనోజ్, మౌనిక.. వీడియో చూశారా?
Manchu Manoj, Bhuma Mounika
Basha Shek
| Edited By: |

Updated on: Jan 09, 2024 | 11:40 AM

Share

టాలీవుడ్ రాక్‌ స్టార్‌ మంచు మనోజ్‌ త్వరలోనే తండ్రిగా ప్రమోషన్‌ పొందనున్నాడు. అతని సతీమణి భూమా మౌనికా రెడ్డి త్వరలోనే ఓ పండంటి బిడ్డను ప్రసవించనుంది. ప్రస్తుతం తన భార్య మౌనిక ప్రెగ్నెన్సీతో ఉందనే శుభవార్తను సోషల్‌ మీడియాలో పంచుకుని మురిసిపోయాడు మనోజ్‌. పర్సనల్‌ విషయాలను పక్కన పెడితే.. ప్రస్తుతం సినిమాలు, టీవీ షోలతో బిజీబిజీగా ఉంటున్నాడు హీరో మనోజ్‌. ప్రొఫెషనల్‌గా, పర్సనల్‌గా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సామాజిక సేవా కార్యక్రమాల కోసం కొంచెం సమయం కేటాయిస్తుంటాడు మనోజ్‌. గతంలో పలు సార్లు అనాథ పిల్లలు, విద్యార్థులకు తన వంతు సాయం చేసి తన మంచి మనసును చాటుకున్నాడు. ఇప్పుడు మరోసారి తన విశాల హృదయాన్ని చాటుకున్నాడు మంచు వారబ్బాయి. మౌనిక ప్రెగ్నెన్సీ గర్భం ధరించడంతో తాజాగా హైదరాబాద్‌లోని ఓ అనాథశ్రమానికి వెళ్లాడు మనోజ్‌. అక్కడి విద్యార్థులకు భోజనాలు ఏర్పాటు చేశాడు. అంతేకాకుండా భార్యతో కలిసి స్వయంగా పిల్లలకు భోజనాలు వడ్డించాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది. దీనిని చూసిన అభిమానులు, నెటిజన్లు మనోజ్‌ దంపతులపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ‘ అభిమానులు.. ‘మీరు గ్రేట్ అన్నా, మీకు అంతా మంచే జరగాలి’ అంటూ కితాబిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మనోజ్‌ సోదరి మంచు లక్ష్మి కూడా ఇటీవల సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటోంది. టీచ్‌ ఫర్‌ ఛేంజ్‌ అంటూ ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకుంటోంది. విద్యార్థుల చదువు, వసతికి కావాల్సిన సౌకర్యాలను సమకూరుస్తోంది. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం వాట్‌ ది ఫిష్ అనే మూవీలో నటిస్తున్నాడు మనోజ్‌. మెగా డాటర్‌ నిహారిక ఇందులో ఒక కీలక పాత్ర పోషిస్తోంది. అలాగే ఈటీవీ విన్‌లో ఉస్తాద్‌ అనే రియాలిటీ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు.

అనాథాశ్రమంలో విద్యార్థులకు భోజనాలు వడ్డిస్తోన్న మనోజ, మౌనిక..

అమ్మానాన్నలు కాబోతున్నాం..

భార్య మౌనికతో మనోజ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా