Manchu Manoj- Bhuma Mounika: మంచు మనోజ్, మౌనిక నయా బిజినెస్.. పిల్లల కోసం కొత్తగా ఇలా..

|

Dec 26, 2023 | 5:13 PM

మంచు మనోజ్‌ గుడ్ న్యూస్ చెప్పిన విషయం తెలిసిందే. తన భార్య భూమా మౌనిక గర్భం దాల్చిందని, త్వరలో తాను తండ్రిని కాబోతున్నానని తెలిపాడు మనోజ్. ఈ ఇద్దరు కలిసి ఇప్పుడు ఓ బిజినెస్ ను ప్రారంభించనున్నారని తెలుస్తోంది. మంచు మనోజ్,భూమా మౌనిక కలిసి ఓ బిజినెస్ మొదలు పెట్టనున్నారు. క్రిస్మస్ సందర్భంగా తమ కొత్త బిజినెస్ గురించి తెలిపారు ఈ స్టార్ జంట.

Manchu Manoj- Bhuma Mounika: మంచు మనోజ్, మౌనిక నయా బిజినెస్.. పిల్లల కోసం కొత్తగా ఇలా..
Manchu Manoj Bhuma Mounika
Follow us on

మంచు మనోజ్ మరోసారి ఇండస్ట్రీలో బిజీ కావాలని ట్రై చేస్తున్నారు. ఇటీవలే ఆయన ఓ టాక్ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు మనోజ్. తన సినిమాలతోనూ ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు మనోజ్. అలాగే మంచు మనోజ్‌ గుడ్ న్యూస్ చెప్పిన విషయం తెలిసిందే. తన భార్య భూమా మౌనిక గర్భం దాల్చిందని, త్వరలో తాను తండ్రిని కాబోతున్నానని తెలిపాడు మనోజ్. ఈ ఇద్దరు కలిసి ఇప్పుడు ఓ బిజినెస్ ను ప్రారంభించనున్నారని తెలుస్తోంది. మంచు మనోజ్,భూమా మౌనిక కలిసి ఓ బిజినెస్ మొదలు పెట్టనున్నారు. క్రిస్మస్ సందర్భంగా తమ కొత్త బిజినెస్ గురించి తెలిపారు ఈ స్టార్ జంట. నమస్తే వరల్డ్‌ అనే బొమ్మల షాపును ప్రారంభించినట్లు తెలిపారు మనోజ్,మౌనిక.

నమస్తే వరల్డ్‌ అనే బొమ్మల షాపును త్వరలోనే ప్రారంభించనున్నారు మనోజ్,మౌనిక. హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ఐమాక్స్‌లో నమస్తే వరల్డ్‌ పేరిట ఈ బొమ్మల షాప్ ను ప్రారంభించనున్నారట. ఈ బొమ్మలన్నీ ఇండియాలో తయారు చేసినవే అని తెలిపారు.  మన దేశంలో ఎన్నో గొప్ప కథలు ఉన్నాయి. పురాణ కథలను ఆధారంగా చేసుకుని అందులోని గొప్ప పాత్రల చుట్టూ కథలు రాశాం. రాసే క్రమంలో మొదటి లాక్‌డౌన్‌ వచ్చింది. అప్పుడేం చేయాలో తెలియక బొమ్మలు గీయడం మొదలుపెట్టాను. అది ఇలా ఉపయోగపడింది అన్నారు మనోజ్.

మౌనిక కృషి వల్లే బొమ్మలు తయారు చేశామని.. దేశం నలుమూలలా తిరిగి ఒక్కో ప్రాంతం నుంచి ఒక్కో ముడిసరుకు తీసుకువచ్చి బొమ్మలు తయారు చేశాం. ఇది పూర్తిగా మేడిన్‌ ఇండియా అని తెలిపారు మంచుమనోజ్. సలార్‌, బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్‌, రోబో.. అలాగే త్వరలో రిలీజ్ కానున్న ఈగల్, హనుమాన్‌ లాంటి సినిమాల్లో సూపర్ హీరోలు ఉన్నారు. ఆ పాత్రలతో గేమ్స్ ను డిజైన్ చేస్తాం అని అన్నారు. ఆ సూపర్ హీరోల పాత్రలను కార్టూన్స్‌గా, బొమ్మలుగా తీర్చిదిద్దాలని ప్రయత్నిస్తున్నాం అని తెలిపారు. అలాగే సీక్రెట్ గా మా ఇంట్లోనే ఆఫీస్ గా మార్చుకొని పని చేస్తున్నాం అని తెలిపారు మనోజ్. అంతే కాదు” మీ పిల్లలు గీసే బొమ్మలను నమస్తే.వరల్డ్‌లో అప్‌లోడ్‌ చేస్తే వాటినిపెయింటింగ్‌ బొమ్మగా చేసి మీకు పంపిస్తాం. అలాగే బెస్ట్‌ బొమ్మలు సెలక్ట్‌ చేసి దాని మీద కార్టూన్స్‌, సూపర్‌ హీరో సినిమాలు చేస్తామని మాటిస్తున్నాం” అని తెలిపారు మంచు మనోజ్ .

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.