Manchu Manoj: అత్తమ్మ జయంతి రోజున శుభవార్త చెప్పిన మంచు వారబ్బాయి.. అమ్మానాన్నలు కాబోతున్న మనోజ్‌- మౌనిక

|

Dec 17, 2023 | 3:12 PM

' మా ప్రియమైన అత్తమ్మ భూమా శోభా నాగిరెడ్డి జయంతి సందర్భంగా ఒక శుభవార్త షేర్‌ చేసుకుంటున్నాం. మీరు, భూమా నాగిరెడ్డి మావయ్య, మోహన్‌ బాబు-నిర్మల మరోసారి అమ్మమ్మ, తాతయ్యలు కాబోతున్నారు. మా ధైరవ్‌ (కుమారుడు) బిగ్‌ బ్రదర్‌ అవుతున్నాడు. ఈ శుభ సందర్భంలో మీ అందరి ప్రేమ, ఆశీస్సులు మాపై ఉండాలి'

Manchu Manoj: అత్తమ్మ జయంతి రోజున శుభవార్త చెప్పిన మంచు వారబ్బాయి.. అమ్మానాన్నలు కాబోతున్న మనోజ్‌- మౌనిక
Manchu Manoj Family
Follow us on

టాలీవుడ్ రాక్‌ స్టార్‌ మంచు మనోజ్‌ శుభవార్త చెప్పాడు. త్వరలో తాను తండ్రిగా ప్రమోషన్‌ పొందనున్నట్లు ప్రకటించాడు. తన భార్య మౌనిక ప్రస్తుతం గర్భంతో ఉందన్నాడు. ఈ మేరకు సోషల్‌ మీడియా వేదికగా తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు. ‘మా ప్రియమైన అత్తమ్మ భూమా శోభా నాగిరెడ్డి జయంతి సందర్భంగా ఒక శుభవార్త షేర్‌ చేసుకుంటున్నాం. మీరు, భూమా నాగిరెడ్డి మావయ్య, మోహన్‌ బాబు-నిర్మల మరోసారి అమ్మమ్మ, తాతయ్యలు కాబోతున్నారు. మా ధైరవ్‌ (కుమారుడు) బిగ్‌ బ్రదర్‌ అవుతున్నాడు. ఈ శుభ సందర్భంలో మీ అందరి ప్రేమ, ఆశీస్సులు మాపై ఉండాలి’ అని తన ఆనందానికి అక్షర రూపమిచ్చాడు మనోజ్‌. ఈ పోస్టులో తన అత్తమ్మ శోభా నాగిరెడ్డి , అలాగే మౌనిక, ధైరవ్‌లతో కలిసి ఉన్న కూడా పంచుకున్నాడీ టాలీవుడ్ హీరో. ప్రస్తుతం ఈ పోస్ట్‌ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు మనోజ్- మౌనిక దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

మనోజ్‌- మౌనికలకు ఇది రెండో పెళ్లి. మౌనికకు ధైరవ్‌ అనే కుమారుడు కూడా ఉన్నాడు. ఎంతో కాలం నుంచి వీరిద్దరూ మంచి స్నేహితులుగా ఉన్నారు. ఈ క్రమంలోనే స్నేహం కాస్తా ప్రేమగా చిగురించింది. ఇరు కుటుంబ సభ్యుల ఆశీర్వాదంతో ఈ ఏడాది మార్చిలో మనోజ్‌- మౌనిక పెళ్లిపీటలెక్కారు. పెళ్లి సమయంలోనే ధైరవ్‌ బాధ్యతలు కూడా తానే తీసుకుంటానని ప్రకటించి తన గొప్ప మనసును చాటుకున్నాడు. ఇక సినిమాల విషయానికొస్తే.. గత కొన్నేళ్లుగా వెండితెరపై కనిపించని మనోజ్ ఇప్పుడు వాట్‌ ది ఫిష్‌ అనే మూవీతో మన ముందుకు వస్తున్నాడు. అలాగే ఈటీవీ విన్‌లో ఉస్తాద్‌ అనే రియాలిటీ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు.

ఇవి కూడా చదవండి

మంచు మనోజ్ పోస్ట్..

భార్య మౌనికతో మనోజ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.