
మంచు లక్ష్మీ కూతురు కు యాక్సిడెంట్ అయ్యిందని తెలుస్తోంది. ఈ యాక్సిడెంట్ జరిగి చాలా కాలం అయిందట. యాక్సిడెంట్ కారణంగా మంచు లక్ష్మీ కూతురి ముఖానికి గాయం అయ్యింది. తాజాగా ఈ విషయం గురించి మంచు లక్ష్మీ క్లారిటీ ఇచ్చారు. మార్చ్ 19 న మోహన్ బాబు పుట్టిన రోజున పిల్లలంతా బగ్గీ లో ప్రయాణిస్తుండగా అది అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టిందట. దాంతో పిల్లలంతా కిందపడిపోయారట. ఆ బగ్గీలో మంచు లక్ష్మీ కూడా ఉన్నారట. ఆ సమయంలో ఆమె పక్కకు దూకేశా.. కానీ పిల్లలంతా కిందపడిపోయారట
పిల్లలంతా రోడ్డు పై పడిపోవడంతో మంచు లక్ష్మీ గట్టిగా అరుస్తూ పిల్లల దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లిందట. అప్పటికే మంచు లక్ష్మీ కూతురు విద్యా నిర్వాణ మొహం నిండా రక్తంతో కనిపించిందట. పాపని గుర్రపు బండి ఎక్కించుకాకుండా ఉంటె బాగుండేది. అలా చేయడం వల్ల తనకు కుట్లు పడ్డాయి అని మంచు లక్ష్మీ ఎమోషనల్ అయ్యింది.
విద్యా నిర్వాణ తో కలిసి మంచు లక్ష్మి రకరకాల వీడియోలు చేస్తూ ఉంటుంది. తన కూతురికి సంబందించిన విషయాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. మోహన్ బాబు పుట్టిన రోజున జరిగిన ఈ యాక్సిడెంట్ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.